చాకలి ఐలమ్మకు జాతీయస్థాయి గుర్తింపు

ABN , First Publish Date - 2022-08-07T05:30:00+05:30 IST

జాతీయస్థాయి నేతల సరసన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మకు గుర్తింపు లభించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజ్‌సారయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి పేర్కొన్నారు.

చాకలి ఐలమ్మకు జాతీయస్థాయి గుర్తింపు
విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య తదితరులు

ఆమె ఉద్యమ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

ఎమ్మెల్సీలు బసవరాజ్‌ సారయ్య, యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి

జగదేవ్‌పూర్‌, ఆగస్టు 7 : జాతీయస్థాయి నేతల సరసన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మకు గుర్తింపు లభించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజ్‌సారయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వారు జగదేవ్‌పూర్‌లో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పోరాటం నేటి యువతరానికి ఆదర్శమని కొనియాడారు. ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొన్న సీఎం కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోయే స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారని, ఇందులో భాగంగానే లాండ్రీ షాపులు నిర్వహించుకునే రజకుల కోసం తెలంగాణ ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐదవ తరగతి పాఠ్య పుస్తకాల్లో చాకలి ఐలమ్మ చరిత్రను తెలంగాణ ప్రభుత్వం చేర్చడం అభినందనీయమన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని ప్రభుత్వ యంత్రాంగం అధికారికంగా నిర్వహించాలని జీవో తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని కొనియాడారు. అనంతరం టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ మాట్లాడుతూ.. జాతి మనుగడ, ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన ఐదుగురు మహిళల సరసన చాకలి ఐలమ్మ గుర్తింపు సాధించినట్టు తెలిపారు. ఐలమ్మ మనమడు రామచంద్రయ్య మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌ పై ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాన రాజకీయ పార్టీలు రజకులకు ఐదు శాతం సీట్లను కేటాయించాలన్నారు. కార్యక్రమంలో మండల రజక సంఘం అధ్యక్షుడు రాజమల్ల ఎల్లేష్‌, చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులు రామచంద్రయ్య, గ్రంథాలయ చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, గజ్వేల్‌ ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌, తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ రామకృష్ణగౌడ్‌, ఎంపీపీ బాలేశం గౌడ్‌, జడ్పీటీసీ సుధాకర్‌ రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్‌ గుండా రంగారెడ్డి, స్థానిక సర్పంచ్‌ లక్ష్మీశ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీటీసీ కవితాశ్రీనివాస్‌రెడ్డి, గజ్వేల్‌ ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌ రెడ్డి, మండల కో ఆప్షన్‌ ఎక్బాల్‌, రజక సంఘం సభ్యులు బాల్‌ నర్సయ్య, యాదగిరి, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-08-07T05:30:00+05:30 IST