స్టెల్లాలో మధుమేహంపై వర్క్‌షాప్‌

ABN , First Publish Date - 2021-12-03T06:19:34+05:30 IST

మారిస్‌ స్టెల్లా కళాశాలలోని బయోకెమిస్ర్టీ విభాగం ఆధ్వర్యంలో గురువారం జాతీయస్థాయి క్విజ్‌ ప్రోగ్రామ్‌, డయాబెటిస్‌పై వర్క్‌షాపు నిర్వహించారు.

స్టెల్లాలో మధుమేహంపై వర్క్‌షాప్‌
కాలుష్య నివారణపై మూకాభినయం ప్రదర్శిస్తున్న విద్యార్థినులు

స్టెల్లాలో మధుమేహంపై వర్క్‌షాప్‌

రామలింగేశ్వరనగర్‌, డిసెంబరు 2:  మారిస్‌ స్టెల్లా కళాశాలలోని బయోకెమిస్ర్టీ విభాగం ఆధ్వర్యంలో గురువారం జాతీయస్థాయి క్విజ్‌ ప్రోగ్రామ్‌, డయాబెటిస్‌పై వర్క్‌షాపు నిర్వహించారు. ఎఫ్‌ఎంబీ విద్యార్థినులు టైప్‌-2 డయాబెటిస్‌ వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఏన్‌ ఇన్‌సైట్‌ టు డయాబెటిస్‌- ది సైలెంట్‌ కిల్లర్‌ అనే అంశంపై అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అవీస్‌ జయప్రద విద్యార్థినులకు వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. క్విజ్‌ విజేతలకు బహుమతులు అందించారు. బీఎస్సీ, ఎఫ్‌ఎంబీ విద్యార్థినులు సుమారు 100 మంది పాల్గొన్నారు. కళాశాలలో కెమీస్ర్టీ విభాగం, భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ కాలుష్య నియంత్రణా దినోత్సవాన్ని పురస్కరించుకుని అవుట్‌రీచ్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. ఆర్‌సీఎం సెయింట్‌ ఆంథోని స్కూల్‌, క్రైస్ట్‌ ది కింగ్‌ తదితర స్కూల్‌ విద్యార్థులు కాలుష్య నివారణపై మూకాభినయం, నాటిక నృత్యరూపకాలను ప్రదర్శించారు. పాఠశాలల ప్రిన్సిపాళ్లు గ్రేస్‌ యూనిస్‌, అర్చన, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-03T06:19:34+05:30 IST