లీనా మణిమేఖలై మరో వివాదాస్పద ట్వీట్‌

ABN , First Publish Date - 2022-07-08T09:08:18+05:30 IST

లీనా మణిమేఖలై మరో వివాదాస్పద ట్వీట్‌

లీనా మణిమేఖలై మరో వివాదాస్పద ట్వీట్‌

న్యూఢిల్లీ, జూలై 7: ప్రవాస భారతీయ దర్శకురాలు లీనా మణిమేఖలై మరో వివాదాస్పద ఫొటోను ట్వీట్‌ చేశారు. ఇటీవల కాళీ మాత సిగరెట్‌ తాగుతున్నట్లుగా ఉన్న చిత్రాన్ని పోస్ట్‌ చేసిన ఆమె.. గురువారం శివ, పార్వతుల వేషధారణల్లోని వ్యక్తులు ధూమపానం చేస్తున్నట్లున్న ఫొటోను ట్వీట్‌ చేశారు. ‘‘మరెక్కడైనా..’’ అంటూ శీర్షిక జత చేశారు. దీనిపైనా తీవ్ర దుమారం రేగగా.. ఇదేమీ తన డాక్యుమెంటరీలోనిది కాదని, గ్రామీణ భారతంలోని నిజ జీవిత దృశ్యమని సమర్థించుకున్నారు. కాగా, కాళీమాతపై చేసిన పోస్ట్‌కు సంబంధించి మణిమేఖలైపై దేశంలో పలుచోట్ల కేసులు నమోదవుతున్నాయి. గతవారం రోజుల్లో తమ కుటుంబం, సన్నిహితులకు ఆన్‌లైన్‌లో 2 లక్షల బెదిరింపులు వచ్చాయని మణిమేఖలై వివరించారు.  

Updated Date - 2022-07-08T09:08:18+05:30 IST