జ్ఞానవాపి మసీదు వద్ద వీడియో సర్వే షురూ

ABN , First Publish Date - 2022-05-15T07:24:40+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారాణసీలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌ వద్ద వీడియోగ్రఫీ సర్వే శనివారం ప్రారంభమైంది.

జ్ఞానవాపి మసీదు వద్ద వీడియో సర్వే షురూ

వారాణసీ, మే 14: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారాణసీలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌ వద్ద వీడియోగ్రఫీ సర్వే శనివారం ప్రారంభమైంది. స్థానిక కోర్టు ఆదేశాలతో పటిష్ఠ పోలీసు భద్రత మధ్య ఈ సర్వేను ప్రారంభించారు. తమ కు అన్ని పార్టీలూ సహకరించాయని, ఎలాంటి ఇబ్బందీ కలగలేదని అధికారులు తెలిపారు. ఆదివారం కూడా సర్వే కొనసాగుతుందన్నారు. పటిష్ట భద్రత మధ్య శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సర్వే జరిగిందని, 50ు పూర్తయిందని వారాణసీ జిల్లా కలెక్టర్‌ కౌశల్‌ రాజ్‌ శర్మ తెలిపారు. ఆదివారమూ సర్వే కొనసాగుతుందన్నారు. కోర్టు ఆదేశాల మేరకు సర్వే అత్యంత గోప్యంగా జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా 1500 మంది పోలీసులను మోహరించడంతోపాటు మసీదుకు అర కిలోమీటరు పరిధిలో జనసంచారాన్ని నిలిపివేశారు. అయితే.. సర్వేపై కొందరు ముస్లింల అభ్యంతరాలపై వాదనలు వినేందుకు కోర్టు అంగీకరించింది. 

Updated Date - 2022-05-15T07:24:40+05:30 IST