‘జాతీయ మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలి’

ABN , First Publish Date - 2020-05-21T09:35:46+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తక్షణమే జాతీయ స్థాయిలో ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియాను కలిపి జాతీయ మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని

‘జాతీయ మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలి’

బర్కత్‌పుర, మే 20(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తక్షణమే జాతీయ స్థాయిలో ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియాను కలిపి జాతీయ మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివా్‌సరెడ్డి డిమాండ్‌ చేశా రు. ప్రస్తుతం ఉన్న ప్రెస్‌ కౌన్సిల్‌ను మీడియా కమిషన్‌లో విలీనం చేయాలని ఆయన కోరారు.


బుధవారం ఆయన బర్కత్‌పురలోని ముద్రా అగ్రికల్చర్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ మల్టీ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ కార్యాలయాన్ని సందర్శించారు. కె.శ్రీనివా్‌సరెడ్డిని ముద్రా కో-ఆపరేటివ్‌ సొసైటీ యాజమాన్యం శాలువా కప్పి ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో ముద్రా కో-ఆపరేటివ్‌ సొసైటీ చైర్మన్‌ టి.రామదాసప్పనాయుడు, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ జి.జ్యోతి, న్యాయ సలహాదారు మాధవి పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-21T09:35:46+05:30 IST