తలపడుతున్న మహారాష్ట్ర, ఆర్‌ఎస్ స్పోర్ట్స్ క్లబ్ హర్యానా జట్లు
నరసాపురం, జనవరి 17: రుస్తుంబాద కబడ్డీ స్టేడియంలో నాలుగు రోజులుగా జరుగుతున్న జాతీయస్థాయి స్ర్తీ, పురుషుల కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. సోమవారం పురుషుల విభాగంలో ఆంధ్ర జట్టు హైదరాబాద్ ఆర్మీ జట్లుపై గెలిచింది. నార్త్ అండ్ రైల్వేపై హర్యానా విజయం సాధించింది. బిహార్‌పై వెస్ట్ బెంగాల్, యూపీపై మహారాష్ట్ర, జైపూర్‌పై హిమాచల్ గెలిచాయి. మహిళా విభాగంలో హర్యానాపై ఆంధ్ర, బిహార్‌పై వెస్ట్ బెంగాల్, కర్ణాటకపై హిమాచల్, కోల్‌కతాపై మహారాష్ట్ర గెలిచాయి.