జిల్లా రెడ్‌క్రాస్‌కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు

ABN , First Publish Date - 2022-10-02T05:08:48+05:30 IST

నెల్లూరు జిల్లా రెడ్‌క్రాస్‌కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉందని జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి తెలిపారు. నెల్లూరు రెడ్‌క్రాస్‌లో శనివారం జాతీయ రక్తదాన దినోత్సవ వేడుకలు జరిగాయి.

జిల్లా రెడ్‌క్రాస్‌కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు
మోటివేటర్లకు జ్ఞాపికలు అందిస్తున్న పంచాయతీ అధికారి ధనలక్ష్మి, చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి

పంచాయితీ జిల్లా అధికారి ధనలక్ష్మి

 మోటివేటర్లకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాల అందజేత

నెల్లూరు (వైద్యం) అక్టోబరు 1 : నెల్లూరు జిల్లా రెడ్‌క్రాస్‌కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉందని జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి  తెలిపారు. నెల్లూరు రెడ్‌క్రాస్‌లో శనివారం జాతీయ రక్తదాన దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడ ఎక్కువ మంది రక్తదాన ప్రేరేపకుల (మోటివేటర్లు)ను చూస్తున్నానన్నారు. జిల్లాలో ఎక్కడ విపత్తు జరిగినా తానున్నానంటూ రెడ్‌క్రాస్‌ ఆపన్న హస్తం అందిస్తోందన్నారు. రెడ్‌క్రాస్‌ కమిటీ చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ . రాష్ట్రంలో రక్తం నిల్వలు తక్కువగా ఉన్నందున యువత రక్తదానం చేయా లని పిలుపునిచ్చారు. అనంతరం 135 మంది రక్తదాన ప్రేరేపకులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ కోశాధికారి సురేష్‌కుమార్‌జైన్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు రవిప్రకాష్‌, జిల్లా కమిటీ సభ్యులు యడవల్లి సురేష్‌, దాసరి రాజేంద్రప్రసాద్‌, రక్తనిధి కన్వీనర్‌ అజయ్‌బాబు, రంజనీ, ఎ.వి. రమణయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-02T05:08:48+05:30 IST