NIMHANSలో బీఎస్సీ

ABN , First Publish Date - 2022-07-04T20:36:57+05:30 IST

బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌(నిమ్‌హాన్స్‌) - బీఎస్సీ ప్రోగ్రామ్‌లతోపాటు సర్టిఫికెట్‌ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంట్రెన్స్‌

NIMHANSలో బీఎస్సీ

బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌( National Institute of Mental Health and Neurosciences)(నిమ్‌హాన్స్‌) - బీఎస్సీ ప్రోగ్రామ్‌లతోపాటు సర్టిఫికెట్‌ కోర్సు(Certificate course)లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ద్వారా బీఎస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.  


బీఎస్సీ ఇన్‌ నర్సింగ్‌

ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు. తరవాత ఏడాది ఇంటర్న్‌షిప్‌  ఉంటుంది. ఆలిండియా కేటగిరీలో 35 సీట్లు ఉన్నాయి. ప్రోగ్రామ్‌ మొత్తమ్మీద అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థికి ‘సిల్వర్‌ జూబ్లీ అవార్డ్‌’ ప్రదానం చేస్తారు. మైక్రోబయా లజీ సబ్జెక్ట్‌లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థికి ‘డా.వీ.శివరంజన్‌ అవార్డ్‌’ ఇస్తారు.

అర్హత: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్‌ ప్రధాన సబ్జెక్ట్‌లుగా కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. 


బీఎస్సీ ఇన్‌ రేడియోగ్రఫీ

ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. తరవాత ఏడాది ఇంటర్న్‌షిప్‌  ఉంటుంది. ఆలిండియా కేటగిరీలో నాలుగు సీట్లు ఉన్నాయి.

అర్హత: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, మేథమెటిక్స్‌ ప్రధాన సబ్జెక్ట్‌లుగా కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్‌/ పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా డయాగ్నస్టిక్‌ రేడియోగ్రఫీ స్పెషలైజేషన్‌తో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.  


బీఎస్సీ ఇన్‌ అనెస్తీషియా టెక్నాలజీ

ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. ఏడాది ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. ఆలిండియా కేటగిరీలో నాలుగు సీట్లు ఉన్నాయి. 

అర్హత: సైన్స్‌ గ్రూప్‌తో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 


బీఎస్సీ ఇన్‌ క్లినికల్‌ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ

ఇది మూడేళ్ల ప్రోగ్రామ్‌. తరవాత ఏడాది ఇంటర్న్‌షిప్‌  ఉంటుంది. ఆలిండియా కేటగిరీలో రెండు సీట్లు ఉన్నాయి. ప్రోగ్రామ్‌లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థికి శ్రీ ముకుంద్‌ మెమోరియల్‌ ప్రైజ్‌ ఇస్తారు.

అర్హత: సైన్స్‌/ మేథ్స్‌ గ్రూప్‌తో ఇంటర్‌/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. 


సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ న్యూరోపాథాలజీ టెక్నాలజీ

ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. రెండు సీట్లు ఉన్నాయి. 

అర్హత: డీఎంఎల్‌టీ ఉత్తీర్ణతతోపాటు ఏడాది అనుభవం ఉండాలి. బీఎస్సీ(ఎంఎల్‌టీ/ లైఫ్‌సైన్సెస్‌) ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 


ముఖ్య సమాచారం

వయసు: బీఎస్సీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి అభ్యర్థులకు 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. సర్టిఫికెట్‌ కోర్సులో ప్రవేశానికి 40 ఏళ్లు మించకూడదు. 

దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 15 

బీఎస్సీలో ప్రవేశానికి ఎంట్రెన్స్‌ టెస్ట్‌ తేదీ: జూలై 24

ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఫలితాలు విడుదల: ఆగస్టు 2న

అడ్మిషన్స్‌: ఆగస్టు 5 నుంచి

ప్రోగ్రామ్‌లు ప్రారంభం: సెప్టెంబరు 1 నుంచి

వెబ్‌సైట్‌: www.nimhans.ac.in

Updated Date - 2022-07-04T20:36:57+05:30 IST