National Herald case: సోనియాపై ED అధికారుల ప్రశ్నల వర్షం

ABN , First Publish Date - 2022-07-27T02:51:41+05:30 IST

న్యూఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ (National Herald case) పత్రిక వ్యవహారంలో మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ(Sonia Gandhi)పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.

National Herald case: సోనియాపై ED అధికారుల ప్రశ్నల వర్షం

న్యూఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ (National Herald case) పత్రిక వ్యవహారంలో మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ(Sonia Gandhi)పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పటివరకూ ఆమెను మొత్తం 55 ప్రశ్నలు అడిగారు. ఇవాళ రెండో రౌండ్‌లో సుమారు 6 గంటల పాటు సోనియాను ప్రశ్నించారు. బుధవారం కూడా రావాలని ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. సోనియా వెంట ప్రియాంక వాద్రా (Priyanka Gandhi Vadra) ఇవాళ కూడా వచ్చారు. సోనియాను ప్రశ్నిస్తున్న గదిలోకి ప్రియాంకను అధికారులు అనుమతించలేదు. 


మరోవైపు సోనియాను ఈడీ అధికారులు ప్రశ్నించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 


ఇదే కేసులో రాహుల్‌గాంధీని కూడా ఈడీ అధికారులు గత నెల 13, 14, 15, 20, 21 తేదీల్లో.. ఐదు రోజులపాటు మొత్తం 53 గంటలు విచారించారు. 


ఏఐసీసీ ఆధ్వర్యంలోని నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక ప్రస్తుత ‘యంగ్‌ ఇండియన్‌’ ప్రైవేటు లిమిటెడ్‌ అధీనంలో ఉంది. దానిని ప్రచురించే సంస్థ పేరు అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌). యంగ్‌ ఇండియన్‌ కంపెనీకి రాహుల్‌, సోనియా ప్రమోటర్లుగా ఉన్నారు. అందులో చెరి 38శాతం వాటా వారికి ఉంది. ఈ కంపెనీ కేవలం రూ.50లక్షలే చెల్లించి.. ఏజేఎల్‌కు కాంగ్రెస్‌ ఇచ్చిన రూ.90.25 కోట్ల రుణాన్ని రికవరీ చేసే హక్కు పొందడంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యంస్వామి 2013లో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. సోనియా, రాహుల్‌ తదితరులు మోసంతో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

Updated Date - 2022-07-27T02:51:41+05:30 IST