తెలంగాణ సీఎస్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అసంతృప్తి

ABN , First Publish Date - 2022-03-16T23:54:03+05:30 IST

తెలంగాణ సీఎస్‌ సోమేష్‌కుమార్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్రమ కంకర మిషన్లపై సరైన చర్యలు తీసుకోలేదని

తెలంగాణ సీఎస్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అసంతృప్తి

ఢిల్లీ: తెలంగాణ సీఎస్‌ సోమేష్‌కుమార్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్రమ కంకర మిషన్లపై సరైన చర్యలు తీసుకోలేదని ఎన్జీటీ మండిపడింది. ఉల్లంఘనలకు పాల్పడినవారిపై ఎలాంటి చర్యలు.. ఎంత జరిమానా విధించారో చెప్పలేదని ఎన్జీటీ తప్పుబట్టింది. చీఫ్ సెక్రటరీ నివేదిక సమగ్రంగా లేదని చెన్నై ఎన్జీటీ ఆక్షేపించింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్‌కు ఎన్జీటీ ఆదేశించింది. పిసాటి ఇందిరారెడ్డి, నిఖిల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్జీటీ విచారణ జరిపింది. తెలంగాణలో 734 కంకర మిషన్లు ఉండేవని ఎన్జీటీకి సీఎస్‌ తెలిపారు. ప్రసుత్తం 208 పనిచేయడం లేదని, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 74 కంకర మిషన్లు మూసివేశామని సీఎస్‌ తెలిపారు. ఈ కేసుపై తదుపరి విచారణ ఏప్రిల్ 28కి చెన్నై ఎన్జీటీ వాయిదా వేసింది.

Updated Date - 2022-03-16T23:54:03+05:30 IST