ఆడపిల్లల చదువు.. సమాజానికి వెలుగు

ABN , First Publish Date - 2021-01-25T05:46:40+05:30 IST

ఆడపిల్లల చదువే.. సమాజానికి వెలుగు అని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి అన్నారు.

ఆడపిల్లల చదువు.. సమాజానికి వెలుగు

  1.  ఇన్‌చార్జి కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి
  2.  ఘనంగా జాతీయ బాలికా దినోత్సవం 


కర్నూలు(హాస్పిటల్‌), జనవరి 24: ఆడపిల్లల చదువే.. సమాజానికి వెలుగు అని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి అన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కేఎస్‌ భాగ్యరేఖ ఆధ్వర్యంలో బీ.క్యాంపులోని ఇన్‌చార్జి కలెక్టర్‌ను కలిసారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్‌ దంపతులు బాలసదనం విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి మాట్లాడుతూ చదువు మధ్యలో మానేసిన, డ్రాప్‌ అవుట్‌లు పొందిన వారిపై శ్రద్ధ వహించాలని సూచించారు. జేడీ ఖాజా మొహిద్దీన్‌ దంపతులు జేసీ బంగ్లా వద్ద ప్రభుత్వ చిల్డ్రన్స్‌ హోం బాలికలతో కలిసి మొక్కలు నాటారు.   కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ కేఎస్‌ భాగ్యరేఖ, పట్టుపరిశ్రమల శాఖ ఏడీ వాణి, డీసీటీవో శారద, సోషల్‌ వర్కర్‌ నరసింహులు,  బాలసదనం  ఇన్‌చార్జి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


రక్తదానం.. ప్రాణదానంతో సమానం: ట్రాఫిక్‌ డీఎస్పీ

రక్తదానం.. ప్రాణదానంతో సమానమని కర్నూలు ట్రాఫిక్‌ డీఎస్పీ మహబూబ్‌ బాషా అన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్‌ బ్యాంకులో ్ఞ్ఞఅమరులైన జవాన్లను స్మరించుకుంటూ రక్తదాన మిత్రులు, జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా భగత్‌సింగ్‌ బ్లడ్‌ డోనర్స్‌ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ట్రాఫిక్‌ డీఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలన్నారు. అనంతరం రక్తదానం చేసిన 47 మంది సభ్యులను ట్రాఫిక్‌ డీఎస్పీ అబినందించారు. కార్యక్రమంలో రక్తదాన మిత్రులు, శివ, రవి, సుమన్‌, వినీషా, మధు, నందిని, విజయ్‌ పాల్గొన్నారు. 


కర్నూలు(న్యూసిటీ): బాలికలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత  ప్రతి ఒక్కరిపై ఉందని కార్మిక శాఖ ఉపకమిషనర్‌ ఎన్‌.శేషగిరిరావు అన్నారు. ఆదివారం జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని రోజా కమ్యూనిటి రిసోర్స్‌ పర్సన్‌ మీసాల సుమలత ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శేషగిరిరావు మాట్లాడుతూ బాలికల పట్ల మానవీయంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో రోజా వీధి మహిళలు పాల్గొన్నారు. 


తుగ్గలి: మండలంలోని జొన్నగిరిలోని ఆర్డీటీ భవనంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కేక్‌ను కట్‌చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసెడెంట్‌ అంజి, జిల్లా స్వైరోసర్కిల్‌ అధ్యక్షుడు నాగేష్‌ మాట్లాడుతూ నేటి బాలికలే రేపటి మహిళా శక్తి అని బాలికల ఎదుగుదలను ఎవరు అడ్డుకోకూడదన్నారు. కార్యక్రమంలో ప్రసాద్‌, పరమేష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-25T05:46:40+05:30 IST