తల్లాడలో వెల్లువెత్తిన వజ్రోత్సవ స్ఫూర్తి

ABN , First Publish Date - 2022-08-12T04:57:16+05:30 IST

వేకువజామునే స్వతంత్ర వజ్రోత్సవ స్ఫూర్తి వెల్లువెత్తింది. 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని 330అడుగుల పొడవైన భారీ త్రివర్ణ పతాకంతో ప్రభాతభేరి నిర్వహించి స్వాతంత్య్ర సమరయోధుల పోరాట కీర్తిని వెలుగెత్తి చాటారు.

తల్లాడలో వెల్లువెత్తిన వజ్రోత్సవ స్ఫూర్తి
330అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన

330 అడుగుల భారీ త్రివర్ణ పతాకంతో ప్రభాతభేరి

తల్లాడ, ఆగస్టు 11: వేకువజామునే స్వతంత్ర వజ్రోత్సవ స్ఫూర్తి వెల్లువెత్తింది. 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని 330అడుగుల పొడవైన భారీ త్రివర్ణ పతాకంతో ప్రభాతభేరి నిర్వహించి స్వాతంత్య్ర సమరయోధుల పోరాట కీర్తిని వెలుగెత్తి చాటారు. గురువారం తెల్లవారుజామున తల్లాడ మండలం రెడ్డిగూడెం గ్రామంలో క్రీస్తూ జ్యోతి విద్యాసంస్థలు, దాసరి వీరభద్రరావు యూత్‌క్లబ్‌, ఐడియా సేవాసంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభారభేరి ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా శ్రీనివా సరావు, ఎంపీడీవో బి.రవీందర్‌రెడ్డి, ఎస్‌ఐ పి.సురేష్‌, ఎంఈవో ఎన్‌.దా మోదర్‌ప్రసాద్‌, సొసైటీ చైర్మన్‌ రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు వెంకట్‌లాల్‌, సర్పంచ్‌ పొట్టేటి సంధ్యారాణి, బద్దం కోటిరెడ్డి, ఎస్‌ఎస్‌వై నిర్వాహకుడు విష్ణుమోహన్‌రావు, క్రీస్తూజ్యోతి డిగ్రీ, జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ పాదర్‌ శ్రీకాంత్‌, పాదర్‌ ప్రాన్సీస్‌, దాసరి వీరభద్రరావు యూత్‌క్లబ్‌, ఐడియా సేవాసంస్థల నిర్వాహకులు అజయ్‌కుమార్‌, రాంబాబు, ధనకొండ నర్సింహారావు, కృష్ణయ్య, కృష్ణారావు, శ్రీనివాసరావు, ముత్యాలరావు, శ్రీనివాసరావు, మూలగుండ్ల నాగేశ్వరరావు, రామారావు, శేషగిరి పాల్గొన్నారు.

Updated Date - 2022-08-12T04:57:16+05:30 IST