ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలి

ABN , First Publish Date - 2022-08-10T03:45:11+05:30 IST

ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరవే సి దేశ భక్తిని చాటాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. మంగళవారం మైనార్టీ ఫంక్షన్‌ హాల్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ జెం డాల పంపిణీలో అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, డీఎఫ్‌వో శివాణి డోంగ్రేతో కలిసి ప్రసంగించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ 75 వసంతాల కార్యక్రమంలో భాగంగా ఈనెల 22 వరకు నిర్వహించనున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.

ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 9: ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరవే సి దేశ భక్తిని చాటాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. మంగళవారం మైనార్టీ ఫంక్షన్‌ హాల్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ జెం డాల పంపిణీలో అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, డీఎఫ్‌వో శివాణి డోంగ్రేతో కలిసి ప్రసంగించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ 75 వసంతాల కార్యక్రమంలో భాగంగా ఈనెల 22 వరకు నిర్వహించనున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. విద్యార్థులకు మహాత్మాగాంధీ చిత్రాన్ని ప్రతీ థియేటర్‌లో ప్రత్యేక ప్రదర్శన జరుగుతుందన్నారు. దేశాభివృద్ధికి కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరం ఐకమత్యంతో కృషి చేయాలని, జాతీయ జెం డాను, జాతీయ గీతాలను గౌరవించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. భావి తరాలకు దేశ భకి ్తని పెంపొందించేలా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను చేపట్టిందని, వజ్రోత్సవాలను పండుగలా నిర్వహించుకోవాలన్నారు. డీఆర్‌డీవో శేషాద్రి, మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, జడ్పీ వైస్‌ చైర్మన్‌ సత్యనారాయణ,  నస్పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, డీపీవో నారాయణరావు, ఈడీ దుర్గా ప్రసాద్‌ అధికారులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-08-10T03:45:11+05:30 IST