ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి : మంత్రి

ABN , First Publish Date - 2022-08-11T05:04:32+05:30 IST

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఇంటిపై

ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి : మంత్రి

మహేశ్వరం, ఆగస్టు 10 : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయడంతోపాటు మాతృదేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన వీరులను స్మరించుకోవాలని విద్యాశాఖమంత్రి పి. సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. భారత వజ్రోత్సవాల సందర్భంగా బుధవారం మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవ కార్యక్రమంలో గడికోట ప్రాంగణంలో 75 మంది 75 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి హాజరైన సబితారెడ్డి మాట్లాడారు. ప్రజల ముఖాలలో చిరునవ్వులు ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్య్ర ఫలాలు అందినట్లని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రంలో ఎప్పటికీ గుర్తుండేలా ఘనంగా వజ్రోత్సవ సంబరాలు నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలిపారు. వజ్రోత్సవాల్లో భాగంగా వన మహోత్సవం, ఫ్రీడం రన్‌, రక్షాబంధన్‌, రక్తదాన శిబిరాల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. జాతీయ స్ఫూర్తితో తీసిన గాంధీజీ సినిమాను ప్రతిఒక్కరూ చూడాలన్నారు. ఆగస్టు 16న అందరూ సామూహిక జాతీయ గీతాలాపన చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ముందు మండలంలోని చిన్నతూప్రా గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా మహేశ్వరంలో నూతనంగా నిర్మిస్తున్న సంత్‌సేవాలాల్‌ ఆలయనిర్మాణ పనులను సబితారెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ కె. రఘుమారెడ్డి, వైస్‌ఎంపీపీ ఆర్‌.సునిత అంద్యానాయక్‌, ఎండీవో బి.నర్సింహులు, మహేశ్వరం సర్పంచ్‌ కె. ప్రియాంకరాజేష్‌, ఆంగోత్‌రాజునాయక్‌, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. 


దేశభక్తుల త్యాగాలను స్మరించుకోవాలి

కందుకూరు : స్వాతంత్య్ర ఉద్యమంలో మాతృదేశం కోసం ప్రాణాలు వదిలిన వీరులతోపాటు దేశభక్తుల త్యాగాలను ప్రతిఒక్కరూ స్మరించుకోవాలని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని బుధవారం కందుకూరు, కొత్తగూడ గ్రామాలలో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడారు. వజ్రోత్సవాలను పుర్కరించుకొని ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. ముఖ్యంగా యువత దేశభక్తిని పెంపొందించుకొని సమాజంలో జరుగుతున్న ప్రజావ్యతిరేఖ విధానాలను గుర్తించాలని కోరారు. ప్రజాసంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి, మహేశ్వరం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎస్‌.సురేందర్‌రెడ్డి, సహకార సంఘం చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌, డీఆర్డీఏ పీడీ ప్రభాకర్‌, తహసీల్దార్‌ ఎస్‌.జ్యోతి, సర్పంచ్‌లు ఎస్‌ శమంతకమణి, సాధ మల్లారెడ్డి, కాసుల రామక్రిష్ణారెడ్డి, యాలాల శ్రీనివాస్‌, భూపాల్‌రెడ్డి, బి.నరేందర్‌గౌడ్‌, పి.బాలమణిఅశోక్‌, కాకి ఇందిరధశరథ, ఎంపీటీసీలు టి.ఇందిరదేవేందర్‌, సురేష్‌, కాకి రాములు,  డైరక్టర్లు ఎస్‌ శేఖర్‌రెడ్డి, పొట్టి ఆనంద్‌, సాద పాండురంగారెడ్డి నాయకులు జయేందర్‌, ఎస్‌.అమరేందర్‌రెడ్డి, కాకి దశరథ, తాళ్ల కార్తీక్‌, బి.దీక్షీత్‌రెడ్డి, దేశం క్రిష్ణారెడ్డి, ఏ.మేఘనాథ్‌రెడ్డి, సామ ప్రకాశ్‌రెడ్డి, మక్తాల వెంకటే్‌షగౌడ్‌, దామోదర్‌గౌడ్‌, పాండుగౌడ్‌, దామోదర్‌రెడ్డి, బాల్‌రెడ్డి,. ఆర్‌ యాదయ్య, కృష్ణసారు, జయమ్మ, ఎండి అంజద్‌ఖాన్‌, బాబయ్య, సామయ్య, ఏపీఎం కవిత, ఏపీవో రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T05:04:32+05:30 IST