నగరం.. త్రివర్ణ శోభితం

ABN , First Publish Date - 2022-08-14T05:53:54+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని నగరంలో శనివారం పెద్ద ఎత్తున ఫ్రీడం ర్యాలీలు నిర్వహించారు. జీడబ్ల్యుఎంసీ పరిధిలోని 66 డివిజన్లలో ప్రజాప్రతినిధులు, అన్నివర్గాల ప్రజ లు మువన్నెల జెండాలను చేబూని ర్యాలీల్లో పాల్గొన్నారు. హనుమకొండ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఫ్రీ డం ర్యాలీని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయం నుంచి జేఎన్‌ మైదానం వరకు ప్రజా ప్రతినిధులు, పోలీసులు సుమారు 500 ద్విచక్రవాహనాలపై ర్యాలీతో కదిలి వెళ్లారు. ద్విచక్రవాహనాలకు జాతీయ జెండాను అమర్చుకుని స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాటం చేసిన అమరులను గుర్తు చేసుకుంటూ కదిలారు.

నగరం.. త్రివర్ణ శోభితం
పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో గాలిలోకి బెలూన్లు వదులుతున్న మంత్రి ఎర్రబెల్లి, చీఫ్‌విప్‌, సీపీ, కలెక్టర్‌, ఎమ్మెల్సీ, మేయర్‌ తదితరులు, పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి ర్యాలీగా వస్తున్న మహిళలు, హసన్‌పర్తిలో ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే రమేశ్‌

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఫ్రీడం ర్యాలీలు
పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
జేఎన్‌ స్టేడియం వరకు సాగిన ర్యాలీ
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు


హనుమకొండ రూరల్‌/హనుమకొండ క్రైం, ఆగస్టు 13: స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని నగరంలో శనివారం పెద్ద ఎత్తున ఫ్రీడం ర్యాలీలు నిర్వహించారు. జీడబ్ల్యుఎంసీ పరిధిలోని 66 డివిజన్లలో ప్రజాప్రతినిధులు, అన్నివర్గాల ప్రజ లు మువన్నెల జెండాలను చేబూని ర్యాలీల్లో పాల్గొన్నారు. హనుమకొండ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో  ఫ్రీ డం ర్యాలీని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయం నుంచి జేఎన్‌ మైదానం వరకు ప్రజా ప్రతినిధులు, పోలీసులు సుమారు 500 ద్విచక్రవాహనాలపై ర్యాలీతో కదిలి వెళ్లారు. ద్విచక్రవాహనాలకు జాతీయ జెండాను అమర్చుకుని స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాటం చేసిన అమరులను గుర్తు చేసుకుంటూ కదిలారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  స్వతం త్ర భారత ఉద్యమస్ఫూర్తిని ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఆనాటి ఉద్యమ నేపథ్యం భావితరాలకు అర్థమయ్యేలా చేయాలన్నారు. 16వ తేదీన సామూహిక స్వతంత్ర జాతీయ గీతాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, అన్నివర్గాల ప్రజలు వజ్రోత్సవాలలో భాగస్వాములై విజయవంతం చేయాలని మంత్రి తెలిపారు. గాంధీజీ ఆశయాలను ఆచరిస్తూ ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా చేయాలని తెలిపారు.

ఈ ఫ్రీడం ర్యాలీలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, మేయర్‌ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌, పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి, జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ ప్రావీణ్య, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, ఆర్‌డీవో వాసుచంద్ర, సెంట్రల్‌జోన్‌ డీసీపీ అశోక్‌కుమార్‌, అదనపు డీసీపీలు పుష్ప, సంజీవ్‌, సురే్‌షలతో పాటు ఏసీపీలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.


 

 

Updated Date - 2022-08-14T05:53:54+05:30 IST