త్రివర్ణ పతాక రెపరెపలు

ABN , First Publish Date - 2022-08-05T05:11:11+05:30 IST

ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా నారాయణపురంలోని శ్రీచైతన్య పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో 150 అడుగుల పొడవు, 8అడుగుల వెడల్పుతో జాతీయ జెండాను తయారు చేసి పాఠశాలలో గురువారం ప్రదర్శించారు

త్రివర్ణ పతాక రెపరెపలు
ఎంసిఎల్‌ 5సి జాతీయ జెండాతో నిర్వహిస్తున్న ర్యాలీ

150 అడుగుల జాతీయ జెండా 

దాచేపల్లి, ఆగస్టు 4: ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా నారాయణపురంలోని శ్రీచైతన్య పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో 150 అడుగుల పొడవు, 8అడుగుల వెడల్పుతో జాతీయ జెండాను తయారు చేసి పాఠశాలలో గురువారం ప్రదర్శించారు. ఈనెల 15వ తేదీన విజయవాడలో జరిగే కార్యక్రమానికి పాఠశాల విద్యార్థులతో కలసి ఉపాధ్యాయులు పాల్గొంటారని తెలిపారు. గురజాల టౌన్‌: గురజాల పట్టణంలో అఖిల భారత విద్యార్థి పరిషత్‌ ఆధ్వర్యాన జయభారతి జూనియర్‌ కళాశాల విద్యార్థులతో 75 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-05T05:11:11+05:30 IST