నీటిలో జాతీయ జెండా

ABN , First Publish Date - 2022-08-15T08:38:23+05:30 IST

నీటిలో జాతీయ జెండా

నీటిలో జాతీయ జెండా

ద్రాక్షారామ: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం హసన్‌బాద జడ్పీ ఉన్నత పాఠశాల దీనికి వేదికైంది. చిత్రలేఖన ఉపాధ్యాయుడు జి.శ్రీను పాఠశాల ఆవరణలో ఆరు అడుగులు పొడవు, నాలుగు అడుగుల వెడల్పు, రెండు అంగుళాలు లోతు గొయ్యి తీసి.. అందులో నీరు పోస్తే ఇంకిపోకుండా సిమెంట్‌తో ఫ్లోరింగ్‌ చేశారు. దానికి తెల్ల రంగు వే ఐలామ్‌షీట్‌తో మూడు భాగాలు ఏర్పాటు చేశారు. పై భాగంలో కాషాయం, మధ్యలో తెలుపు, మూడో భాగంలో పచ్చ రంగులు కలిపిన నీళ్లు పోశారు.

Updated Date - 2022-08-15T08:38:23+05:30 IST