‘తారా’ అధ్యాపకుడికి జాతీయ ఎక్సలెన్స్‌ అవార్డు

ABN , First Publish Date - 2022-08-14T04:58:29+05:30 IST

సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకుడు, ఎన్‌ఎ్‌సఎ్‌స అధికారి డాక్టర్‌ జగదీశ్వర్‌ జాతీయస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు.

‘తారా’ అధ్యాపకుడికి జాతీయ ఎక్సలెన్స్‌ అవార్డు
అవార్డును అందుకుంటున్న డాక్టర్‌ జగదీశ్వర్‌

సంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 13:  సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకుడు, ఎన్‌ఎ్‌సఎ్‌స అధికారి డాక్టర్‌ జగదీశ్వర్‌ జాతీయస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన సామాజిక సేవకు ఎక్సలెన్స్‌ అవార్డు వరించింది. ఎన్‌ఎ్‌సఎ్‌స అధికారిగా గ్రామాలను దత్తత తీసుకొని స్వచ్ఛ భారత్‌, హరితహారం, సామాజిక అంశాలపై అవగాహన, మెడికల్‌ క్యాంపుల నిర్వహణ వంటి కార్యక్రమాలను నిర్వహించినందుకుగాను ఆయన నేషనల్‌ ఎక్సలెన్స్‌ అవార్డు దక్కించుకున్నారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్‌పాండే, కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రామ్‌దాస్‌ అథావాలె చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును వరల్డ్‌ యూత్‌ ఆర్గనైజేషన్‌, నేషనల్‌ యూత్‌ అవార్డీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ యూత్‌ ఫోరం సంయుక్తంగా ప్రదానం చేసింది. కళాశాల అధ్యాపకుడు జగదీశ్వర్‌కు జాతీయస్థాయి అవార్డు రావడం కళాశాలకే గర్వకారణమని ప్రిన్సిపాల్‌ ప్రవీణ, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌వైఏ    ఎఫ్‌ఐ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ జావిద్‌ జమేదార్‌, మాంటెనీగ్రో దేశ కౌన్సిల్‌ జనరల్‌ డాక్టర్‌ జనీసి దర్బరీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-14T04:58:29+05:30 IST