Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 10 Nov 2021 16:36:18 IST

వయసులో తనకంటే చిన్నోడితో Rashmika Mandanna డేటింగ్‌లో ఉందా..? తాజాగా ఆమె మాటలకు అర్థమేంటి..?

twitter-iconwatsapp-iconfb-icon

నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా అంటే అందరికీ  గుర్తుకొచ్చే పేరు రష్మిక మందన్న. అత్యంత ప్రభావమంతమైన నటులల్లో ఫోర్బ్స్ లిస్ట్‌లో ఆమెనే మొదటి స్థానం పొందింది. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ ప్రస్తుతం బిజీగా ఉంది. రష్మిక ఈ మధ్య మీడియాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. లవ్, డేటింగ్, బాయ్స్ గురించి మాట్లాడింది. 


‘‘ కూర్గ్‌లో నేను పెరిగాను. ఆ ప్రాంతంలో ఇళ్లు విసిరేసినట్టుగా చాలా దూరంగా ఉండేవి. నేను కూర్గ్‌లో ఉన్నప్పుడు కూర్గీకి చెందిన బాయ్‌ని చూడలేదు. అందరూ బాయ్స్ ఎక్కడికీ తప్పి‌పోయారని మా తల్లిదండ్రులను అడిగేదాన్ని. నా డేటింగ్ లైఫ్ ఏలా సాగిందో మీకు తెలుసా ? ఒక బాయ్‌ని చూడగానే డేటింగ్ మొదలైందని అనుకునేదాన్ని. నా స్నేహితులందరూ ఆ వ్యక్తి పేరు చెప్పి నన్ను ఆటపట్టించేవారు. నన్ను జాగ్రత్తగా చూసుకునే వ్యక్తిని నేను ఇష్టపడతాను. నన్ను మార్చడానికి ఏమాత్రం ప్రయత్నించకూడదు. ఈ విషయాలు అన్ని చాలా చిన్నవి. వయసు అనేది చాలా చిన్న విషయం దాని గురించి నేను పట్టించుకోను.  వర్కౌట్లు చేస్తూ ఫిట్‌గా ఉండే వ్యక్తులు అంటే నాకు ఇష్టం. వారు అటువంటి ఫొటోలనే సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్చర్స్‌గా పెట్టుకుంటే బాగుంటుంది ’’ అని రష్మిక మందన్న చెప్పింది. 


రష్మిక మందన్న బాలీవుడ్‌లోకి  ‘‘ మిషన్ మజ్ను’’ అనే చిత్రం ద్వారా రంగప్రవేశం చేస్తోంది. ఈ చిత్రంలో  సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్ సరసన గుడ్‌బై అనే చిత్రంలోను ఆమె నటిస్తోంది. ఈ సినిమాలో మరో కీలక పాత్రను నీనాగుప్తా  పోషిస్తోంది. టాలీవుడ్‌లో పుష్పతో పాటు ఆడాళ్లు మీకు జోహర్లు అనే సినిమాల్లో ఆమె నటిస్తోంది.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement