ఉద్దేశపూర్వకంగానే సంజయ్ అరెస్టు: తల్లోజు ఆచారి

ABN , First Publish Date - 2022-01-20T23:48:08+05:30 IST

దీక్ష చేస్తున్న బండి సంజయ్ అరెస్టును చేయడం ఉద్దేశపూర్వకంగా జరిగినట్లు

ఉద్దేశపూర్వకంగానే సంజయ్ అరెస్టు: తల్లోజు ఆచారి

కరీంనగర్: దీక్ష చేస్తున్న బండి సంజయ్ అరెస్టును చేయడం ఉద్దేశపూర్వకంగా జరిగినట్లు భావిస్తున్నామని జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి అన్నారు. బండి అరెస్ట్‌పై బీసీ కమిషన్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఘటనపై విచారణ జరిపారు.  రాష్ట్ర హోం సెక్రెటరీకి ఘటన మినిట్స్‌ను పంపిస్తామని బీసీ కమిషన్ తెలిపింది.  ఘటనలో పాల్గొన్న పోలీసులపై కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా డీజీపీ బాధ్యత తీసుకోవాలని కమిషన్ సూచించింది. ఎంపీ హక్కులను కాలరాసే అధికారం పోలీసులకు లేదని ఆచారి అన్నారు. సొంత కార్యాలయంలో దీక్ష చేస్తుంటే గ్యాస్ కట్టర్లతో డోర్లు ఓపెన్ చేయడాన్ని తప్పుబడుతున్నామని కమిషన్ పేర్కొంది. అనామకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని పోలీసులకు జాతీయ బీసీ కమిషన్ సూచించింది. ఈనెల‌ 2 తర్వాత కరీంనగర్‌లో జరిగిన కొవిడ్‌ రూల్స్ ఉల్లంఘనపై కేసులు రిజిస్టర్ చేయాలని సీపీని ఆదేశిస్తున్నట్లు బీసీ కమిషన్ పేర్కొంది. తదుపరి విచారణ 15రోజుల తర్వాత ఉంటుందని బీసీ కమిషన్ తెలిపింది. 


Updated Date - 2022-01-20T23:48:08+05:30 IST