చొప్పదండి సహకార సంఘం, జిల్లా కేంద్ర బ్యాంకులకు జాతీయ అవార్డు

ABN , First Publish Date - 2022-08-13T05:25:29+05:30 IST

కరీంనగర్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, చొప్పదండి సహకార సంఘానికి జాతీయ అవార్డులు దక్కాయి.

చొప్పదండి సహకార సంఘం, జిల్లా కేంద్ర బ్యాంకులకు జాతీయ అవార్డు
అవార్డు అందుకుంటున్న బ్యాంకు చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, సీఈఓ సత్యనారాయణరావు

 ఢిల్లీలో అందుకున్న నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు

భగత్‌నగర్‌/చొప్పదండి, ఆగస్టు 12: కరీంనగర్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, చొప్పదండి సహకార సంఘానికి జాతీయ అవార్డులు దక్కాయి. గత దశాబ్ధపు ఉత్తమ అత్యుత్తమ సహకార బ్యాంకు, అత్యుత్తమ సహకార సంఘంగా అవార్డును శుక్రవారం ఢిల్లీలో జరిగిన గ్రామీణ సహకార బ్యాంకుల సమావేశంలో సొంతం చేసుకున్నాయి. ఢిల్లీలో జరిగిన గ్రామీణ సహకార బ్యాంకుల సమావేశంలో కేంద్ర గృహ, సహకార శాఖ మాత్యులు అమిత్‌ షా చేతుల మీదుగా నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌, కరీంనగర్‌ బ్యాంకు అధ్యక్షుడు కొండూరు రవీందర్‌రావు, బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణాధికారి ఎన్‌ సత్యనారాయణరావు, చొప్పదండి సహకార సంఘం చైర్మన్‌ వెల్మ మల్లారెడ్డి, సీఈఓ తిరుపతిరెడ్డి అవార్డును అందుకున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం, నాబార్డు ద్వారా కేంద్ర సహకార బ్యాంకు అవార్డులను సొంతం చేసుకుంది. బ్యాంకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించడం పట్ల బ్యాంకు ఛైర్మన్‌ రవీందర్‌రావు, కరీంనగర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా చొప్పదండి సహకార సంఘం 20ఏళ్లుగా రైతులకు ఉత్తమ సేవలు అందిస్తోందని అన్నారు. 

Updated Date - 2022-08-13T05:25:29+05:30 IST