మదర్సాలలో జాతీయ గీతాలాపన తప్పనిసరి.. ప్రభుత్వ ఆదేశాలు

ABN , First Publish Date - 2022-05-13T17:54:58+05:30 IST

రాష్ట్రంలోని అన్ని మదర్సాల(madarasala)లో జాతీయ గీతాలాపన(National Anthem)ను తప్పనిసరి చేస్తూ ఉత్తరప్రదేశ్‌ సర్కారు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 24న జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు..

మదర్సాలలో జాతీయ గీతాలాపన తప్పనిసరి.. ప్రభుత్వ ఆదేశాలు

లఖ్‌నవూ, మే 12: రాష్ట్రంలోని అన్ని మదర్సాల(madarasala)లో జాతీయ గీతాలాపన(National Anthem)ను తప్పనిసరి చేస్తూ ఉత్తరప్రదేశ్‌ సర్కారు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 24న జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గురువారం నుంచి మదర్సా తరగతులు మొదలుకానున్న నేపథ్యంలో, అదే రోజున ఆదేశాలు అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. పాఠశాల తరగతులు మొదలయ్యే ముందుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కచ్చితంగా జనగణమన పాడాలని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఆ ఆదేశాల అమలు బాధ్యతలను జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారుల(Minority welfare officers)కు అప్పగించింది. 

Read more