గొంతులన్నీ ఏకమై

ABN , First Publish Date - 2022-08-17T05:14:12+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాముహిక జాతీయ గీతాలపనలో జిల్లావ్యాప్తంగా ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 11:30 గంటలకు సిద్దిపేట జిల్లా కేంద్రంతో మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో జాతీయ గీతాలాపన చేశారు. సిద్దిపేట పాత బస్టాండ్‌ వద్ద జాతీయ గీతాలాపనలో కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ రోజా రాధాకృష్ణశర్మ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరాజనర్సు పాల్గొన్నారు.

గొంతులన్నీ ఏకమై
సిద్దిపేటలో జాతీయ గీతాలాపన చేస్తున్న విద్యార్థులు, ప్రజలు

సామూహిక జాతీయగీతాలాపనకు అపూర్వ స్పందన

నిలిచిన జనం, కదలని వాహనాలు

పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు, రైతులు, కూలీలు


సిద్దిపేటటౌన్‌/సిద్దిపేటఅర్బన్‌/హుస్నాబాద్‌/చేర్యాల/ రాయపోల్‌/గజ్వేల్‌/గజ్వేల్‌రూరల్‌/వర్గల్‌, ఆగస్టు 16: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాముహిక జాతీయ గీతాలపనలో జిల్లావ్యాప్తంగా ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 11:30 గంటలకు సిద్దిపేట జిల్లా కేంద్రంతో మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో జాతీయ గీతాలాపన చేశారు. సిద్దిపేట పాత బస్టాండ్‌ వద్ద జాతీయ గీతాలాపనలో కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ రోజా రాధాకృష్ణశర్మ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరాజనర్సు పాల్గొన్నారు. విద్యార్థులు, వాహనదారులు, పాదచారులు ఎక్కడివారక్కడే జాతీయ గీతాలాపన చేశారు. ఏసీపీ దేవారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌రెడ్డి, మాజీ చైర్మన్‌ రాజనర్సు, కౌన్సిలర్లు, అధికారులు, కళాకారులు, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు జాతీయ గీతాలాపన చేశారు. సిద్దిపేట మున్సిపల్‌ పరిధిలోని నర్సాపూర్‌లో గీత కార్మికులు తాటిచెట్టుపై జెండాలను ప్రదర్శిస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు.


హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు

హుస్నాబాద్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తాలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ హాజరయ్యారు. విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, స్వచ్ఛంద సంఘాల నాయకులు, ఆర్యవైశ్య సంఘ నాయకులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆయా ప్రదేశాల్లో జాతీయగీతాలపనలో జడ్పీ వైస్‌ చైర్మెన్‌ రాయిరెడ్డి రాజారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అనిత, ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఏసీపీ సతీష్‌, ఎంపీపీ మానస, లక్ష్మీ, జడ్పీటీసీ భూక్య మంగ, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ కాసర్ల అశోక్‌బాబు, కమిషనర్‌ రాజమల్లయ్య, వైస్‌ చైర్‌పర్సన్‌ అయిలేని అనిత, సీఐ రఘుపతిరెడ్డి, ఎస్‌ఐ శ్రీధర్‌, మాజీ ఎంపీపీ వెంకట్‌, వెంకట్రాంరెడ్డి, అన్వర్‌, ఏ.తిరుపతిరెడ్డి, గోపాల్‌రెడ్డి, నళినిదేవి, భాగ్యరెడ్డి, స్వర్ణలత, శివసేన నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లిఖార్జున్‌రెడ్డి, బీజేపీ నాయకుడు వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

చేర్యాల, కొమురవెల్లి మండలాల్లో జాతీయగీతాలపన పండుగలా నిర్వహించారు. కొమురవెల్లి మండలకేంద్రంలో నిర్వహించిన సామూహిక గీతాలాపన కార్యక్రమానికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హాజరయ్యారు. ఎంపీపీ కీర్తన, జడ్పీటీసీ సిద్దప్ప, వైస్‌ ఎంపీపీ రాజేందర్‌రెడ్డి, సర్పంచ్‌ లత, ఎంపీటీసీలు కవిత, రాజమణి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు భిక్షపతి, వంగా రాణి, మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు. చేర్యాలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వరూపారాణి, వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌, కమిషనర్‌ రాజేంద్రకుమార్‌, సీఐ శ్రీనివాస్‌, కౌన్సిలర్లు, వ్యాపారులు, ప్రజలు, విద్యార్థులు జనగామ-సిద్దిపేట రహదారికి ఇరువైపులా 2 కిలోమీటర్ల మేర మానవహారం ఏర్పాటుచేసి జాతీయగీతాన్ని ఆలపించారు. ఆకునూరు, ముస్త్యాల, వేచరేణి,. వీరన్నపేట, పోతిరెడ్డిపల్లి, నాగపురి తదితర గ్రామాల్లో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 

రాయపోల్‌లో అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద నిర్వహించిన సామూహిక గీతాలాపనలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌ పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలిసి మొక్కలు నాటారు. టీఆర్‌ఎస్‌ నాయకులు మోహన్‌రెడ్డి, వెంకటేశ్వరశర్మ, ఎంపీపీ అనిత, జడ్పీటీసీ యాదగిరి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ మౌనికారాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గజ్వేల్‌ పట్టణంలోని ఇందిరాపార్కు చౌరస్తాలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి, ఎఫ్‌ఢీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, వైస్‌ చైర్మన్‌ జకీ, కౌన్సిలర్లు గోపాల్‌రెడ్డి, మెట్టయ్య, శిరీషారాజు పాల్గొన్నారు. సమీకృత మార్కెట్‌లో ఏఎంసీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో సీఐ వీరప్రసాద్‌, ప్రజ్ఞాపూర్‌లో ట్రాఫిక్‌ సీఐ తిరుపతి, శివాజీచౌక్‌లో కౌన్సిలర్లు బాలమణి, చందనరవి, ఏటిగడ్డ కిష్టాపూర్‌లో సర్పంచ్‌ ప్రతా్‌పరెడ్డి ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు.

వర్గల్‌ మండలం గౌరారం వద్ద రాజీవ్‌ రహదారిపై గ్రామ సర్పంచ్‌ వినోదానర్సింహారెడ్డి, వైస్‌ ఎంపీపీ బాల్‌రెడ్డి, ఎస్‌ఐ సంపత్‌కుమార్‌, కనకరాజు ఆధ్వర్యంలో పలు పాఠశాలల విద్యార్థులు 300 మీటర్ల జాతీయ పతాకంతో ప్రదర్శన చేశారు. విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలో ఆకట్టుకున్నారు. ఎంపీపీ లత రమేశ్‌గౌడ్‌, జడ్పీటీసీ బాలు యాదవ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-17T05:14:12+05:30 IST