Advertisement
Advertisement
Abn logo
Advertisement

అలరించిన పృధ్వీరాజ్‌ రాసో నాటకం

గుంటూరు(సాంస్కృతికం), అక్టోబరు 23: స్థానిక ఎల్‌వీఆర్‌ సన్స క్లబ్‌ ప్రాంగణంలో కళావిపంచి, ఆరాధన ఆర్ట్స్‌ అకాడమీ, కేఆర్‌కే ఈవెంట్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో వైకే నాగేశ్వరరావు నాటకోత్సవాల్లో రెండవరోజు శనివారం ప్రదర్శించిన పృధ్వీరాజ్‌ రాసో నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌, క్లబ్‌ కోశాధికారి మిట్టపల్లి శివకుమార్‌, సహాయ కార్యదర్శి యర్రగుంట్ల అప్పారావు, రంగస్థల నటులు ఎంవీఎల్‌ నరసింహారావు,చిట్టినేని లక్ష్మీనారాయణ, రామరాజు శ్రీనివాస్‌, మల్లిఖార్జునరావు, బొప్పన నరసింహారావు, రామకృష్ణ ప్రసాద్‌ కాట్రగడ్డ తదితరులు పాల్గొని రంగస్థల నటీమణులు విజయలక్ష్మి, విజయకుమారిను వైకే నాగేశ్వరావు పురస్కారంతో సత్కరించారు.  కార్యక్రమాన్ని జీవీజీ శంకర్‌ పర్యవేక్షించారు.

Advertisement
Advertisement