తెలుగు నాటకం సజీవ కళారూపం

ABN , First Publish Date - 2021-04-17T05:43:38+05:30 IST

తెలుగు నాటకం సజీవ కళారూపమని వక్తలు అభిప్రాయపడ్డారు. కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా శుక్రవారం తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని అభ్యుదయ కళాసమితి, బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సమితి కార్యాలయంలో నిర్వహించారు.

తెలుగు నాటకం సజీవ కళారూపం
సీనియర్‌ నాటక కళాకారులను సత్కరిస్తున్న కళాసమితి నిర్వాహకులు

కందుకూరి జయంతి సభలో వక్తలు

తెనాలిటౌన్‌, ఏప్రిల్‌ 16: తెలుగు నాటకం సజీవ కళారూపమని వక్తలు అభిప్రాయపడ్డారు. కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా శుక్రవారం తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని అభ్యుదయ కళాసమితి, బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సమితి కార్యాలయంలో నిర్వహించారు. సభకు సమితి వ్యవస్థాపకులు బొల్లిముంత కృష్ణ అధ్యక్షత వహించారు. వక్తలు మాట్లాడుతూ.. తెలుగు పద్యానికున్న సౌందర్యం, సొగసు మరే భాషలోనూ రాదన్నారు. .కందుకూరి స్ఫూర్తిని నేటి తరం నాటక రచయితలు, కళాకారులు అందిపుచ్చుకోవాలన్నారు. కళాకారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సత్యనారాయణ శెట్టి, గరికపాటి సుబ్బారావు, దేవిశెట్టి కౄష్ణారావు, పద్మజా ప్రభాకర్‌ తదితరులు ప్రసంగించారు. నాటకరంగ కళాకారులు ఎన్‌.ప్రసాద్‌(డెయిరీ), డి.వి.సుబ్బయ్య, విజయదుర్గ, చిట్టూరి సీతారామయ్యను ఈసందర్భంగా ఘనంగా సత్కరించారు. కళాసమితి సభ్యులు బెల్లంకొండ వెంకట్‌, చందు సూర్య, శ్రీదేవి, రత్నకుమారి, పూర్ణ తదితరులు పర్యవేక్షించారు.

Updated Date - 2021-04-17T05:43:38+05:30 IST