నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం

ABN , First Publish Date - 2020-12-06T05:42:18+05:30 IST

నివర్‌ తుఫాన్‌ కారణంగా మార్కాపురం డివిజన్‌లో పంట నష్టపో యిన ప్రతి రైతుకూ పరిహారం అందించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అధికారుల ను ఆదేశించారు.

నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సురేష్‌

అధికారులకు మంత్రి సురేష్‌ ఆదేశం

మార్కాపురం, డిసెంబరు 5 : నివర్‌ తుఫాన్‌ కారణంగా మార్కాపురం డివిజన్‌లో పంట నష్టపో యిన ప్రతి రైతుకూ పరిహారం అందించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అధికారుల ను ఆదేశించారు. స్థానిక కంభం రోడ్డులోని  శ్రీని వాస కల్యాణ మండపంలో తుఫాన్‌ నష్టాలపై డివి జన్‌ స్థాయి అధికారులతో ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలతో డివి జన్‌లో 40 వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు. వీటితోపాటు పంచా యతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌ శాఖలకు సుమారు రూ.45 కోట్ల మేర నష్టం  వాటిల్లినట్లు ప్రాథమి కంగా అంచనా వేశారన్నారు. సంబంధిత శాఖల అధికారులు ఈ నెల 15వతేదీ లోపు పూర్తి స్థాయి నష్టం అంచనాలను తయారు చేసి నివేదికలను పం పాలన్నారు. నష్టపోయిన రైతులకు ఈ నెల 31 లోపు ప్రభుత్వం పరిహారం అందిస్తుందని తెలిపా రు. రాష్ట్రంలో ఈనెల 7 నుంచి 21 వరకూ వ్యర్థంపై యుద్ధం పేరుతో పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్ర మాల నిర్వహణకు ప్రభుత్వం పిలుపునిచ్చిం దన్నా రు. దీన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. మార్కాపురం ఎమ్మె ల్యే కందురు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ మార్కా పురం చెరువు అలుగు నుంచి బోడపాడు చెరువు వరకూ ఉన్న సప్లయ్‌ చానల్‌ మరమ్మతులకు ప్రభు త్వం వెంటనే నిధులు మంజూరు చేసిందన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మా ట్లాడుతూ తమ నియో జకవర్గంలో రెవెన్యూ అధి కారులపై అధికంగా ఫిర్యాదులు వస్తు న్నాయ న్నారు. సచివాలయా లను మూడు రోజులకో సారి అధికారులు తనిఖీ చేసేలా చర్యలు తీసు కోవాలని కోరారు. సమా వేశంలో జేడీఏ శ్రీరామ్మూర్తి, ఏపీఎంఐపీ పీడీ రవీంద్ర, పశుసంవర్థక శాఖ జేడీ రవీంద్రనాఽథ్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈ రెడ్డయ్య, డీపీవో జి.వి. నారాయణ రెడ్డి, డీఈవో సుబ్బారావు, ఆర్డీవో శేషిరెడ్డి, డీఎస్పీ డాక్టర్‌ ఎం.కిశోర్‌కుమార్‌, డీడీవో సాయికుమార్‌, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారు లు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-06T05:42:18+05:30 IST