‘టెండూల్కర్‌ అవుట్‌’ కోసం ఎన్ని సమావేశాలో..

ABN , First Publish Date - 2020-07-05T08:50:26+05:30 IST

సచిన్‌ టెండూల్కర్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌ అద్భుతమని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌ ప్రశంసించాడు. మాస్టర్‌ను ఎలా అవుట్‌ చేయాలనే ...

‘టెండూల్కర్‌ అవుట్‌’ కోసం ఎన్ని సమావేశాలో..

న్యూఢిల్లీ: సచిన్‌ టెండూల్కర్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌ అద్భుతమని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌ ప్రశంసించాడు. మాస్టర్‌ను ఎలా అవుట్‌ చేయాలనే దానిపై తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు బుర్ర బద్దలు కొట్టుకొనే వాడినన్నాడు. టీమిండియాతో మ్యాచ్‌ అంటే సచిన్‌ను ఎలా కట్టడి చేయాలనే వ్యూహంపై అనేకసార్లు జట్టు సమావేశాలు నిర్వహించే వాడినని చెప్పాడు. ‘సచిన్‌ టెక్నిక్‌ అద్భుతం. నేను ఇంగ్లండ్‌ జట్టు సారథిగా ఉన్నప్పుడు సచిన్‌ను ఎలా అవుట్‌ చేయాలనే దానిపై ఎన్నిసార్లు టీమ్‌ సమావేశాలు నిర్వహించానో లెక్కేలేదు’ అని ఐసీసీ పాడ్‌కాస్ట్‌ ‘క్రికెట్‌ ఇన్‌సైడ్‌ అవుట్‌’లో హుస్సేన్‌ చెప్పాడు. కాగా.. అప్పట్లో కెప్టెన్‌గా ఉన్న సౌరవ్‌ గంగూలీ మ్యాచ్‌ టాస్‌ సమయంలో అనేకసార్లు తనను ఎదురుచూసేలా చేసేవాడనీ.. అందుకే అతనంటే చాలా కోపముండేదని నాసిర్‌ హుస్సేన్‌ తెలిపాడు. కానీ.. ఆ తర్వాత గంగూలీ చాలా మంచోడని తెలుసుకున్నానన్నాడు. 

Updated Date - 2020-07-05T08:50:26+05:30 IST