ముక్కు టీకా సురక్షితం

ABN , First Publish Date - 2022-08-16T06:44:35+05:30 IST

పంద్రాగస్టు పండుగ వేళ భారత్‌ బయోటెక్‌ సంస్థ శుభవార్త వినిపించింది. తాము అభివృద్ధి చేసిన ఇంట్రానేజల్‌ వ్యాక్సిన్‌ (ముక్కు టీకా)కు..

ముక్కు టీకా సురక్షితం

మూడో దశ ప్రయోగ పరీక్షలు పూర్తి

భారత్‌ బయోటెక్‌ సంస్థ వెల్లడి


హైదరాబాద్‌, ఆగస్టు 15: పంద్రాగస్టు పండుగ వేళ భారత్‌ బయోటెక్‌ సంస్థ శుభవార్త వినిపించింది. తాము అభివృద్ధి చేసిన ఇంట్రానేజల్‌ వ్యాక్సిన్‌ (ముక్కు టీకా)కు సంబంధించి, మూడో దశ ట్రయల్స్‌లో అది సురక్షితమని తేలిందని భారత్‌ బయోటెక్‌ జేఎండీ సుచిత్ర ఎల్లా తెలిపారు. వాషింగ్టన్‌ యూనివర్సిటీ సెయింట్‌ లూయిస్‌ భాగస్వామ్యంతో సంస్థ ఈ టీకాను ‘బీబీవీ 154’ పేరిట రూపొందించింది. అనుమతుల నిమిత్తం.. ఈ ట్రయల్స్‌ సమాచారాన్ని నియంత్రణ సంస్థలకు అందజేశామని సంస్థ తెలిపింది.

Updated Date - 2022-08-16T06:44:35+05:30 IST