'నాసా' వెంటిలేటర్ల తయారీ అవకాశం ద‌క్కించుకున్న హైదరాబాదీ కంపెనీ

ABN , First Publish Date - 2020-05-31T12:22:53+05:30 IST

కొవిడ్‌-19 రోగుల చికిత్స కోసం నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ర్టేషన్‌(నాసా) అభివృద్ధి చేసిన వెంటిలేటర్లను భారత్‌కు చెందిన మూడు కంపెనీలు తయారు చేయనున్నాయి.

'నాసా' వెంటిలేటర్ల తయారీ అవకాశం ద‌క్కించుకున్న హైదరాబాదీ కంపెనీ

వాషింగ్టన్‌, మే 30: కొవిడ్‌-19 రోగుల చికిత్స కోసం నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ర్టేషన్‌(నాసా) అభివృద్ధి చేసిన వెంటిలేటర్లను భారత్‌కు చెందిన మూడు కంపెనీలు తయారు చేయనున్నాయి. ఇందుకు సంబంధించి ఈ కంపెనీలు నాసా నుంచి లైసెన్స్‌ పొందాయి. వీటిలో హైదరాబాద్‌కు చెందిన మేధ సర్వో డ్రైవ్స్‌, అల్ఫా డిజైన్‌ టెక్నాలజీస్‌, భారత్‌ ఫోర్జ్‌ ఉన్నాయి. ఇతర దేశాలకు చెందిన 18 కంపెనీలు కూడా నాసా వెంటిలేటర్లను తయారు చేయనున్నాయి. కరోనా వైరస్‌ రోగుల కోసం సదరన్‌ కాలిఫోర్నియాలోని తన జెట్‌ ప్రొపుల్షన్‌ లేబొరెటరీ(జేపీఎల్‌)లో ప్రత్యేక వెంటిలేటర్‌ను వైటల్‌ పేరుతో నాసా అభివృద్ధి చేసింది. జేపీఎల్‌ ఇంజినీర్లు నెలరోజుల్లోనే దీన్ని రూపొందించగా ఏప్రిల్‌ 30న ఎఫ్‌డీఏ నుంచి అనుమతి లభించింది. సాంప్రదాయ వెంటిలేటర్‌తో పోల్చితే ఏడింట ఒకవంతు విడిభాగాలతో వైటల్‌ను తయారు చేయొచ్చు. దీని విడిభాగాలు కూడా ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.


Updated Date - 2020-05-31T12:22:53+05:30 IST