చంద్రుడిపై వైఫై నెట్‌వర్క్‌.. నాసా ప్రయోగం

ABN , First Publish Date - 2021-10-19T02:13:33+05:30 IST

'క్లీవ్‌ల్యాండ్‌'లో దాదాపు 31శాతం కుటుంబాలకు ఇంటర్నెట్‌ సదుపాయం లేదు. అయితే ఈ సమస్య పరిష్కారం కోసం ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ 'గ్రేటర్ క్లీవ్‌ల్యాండ్ పార్ట్‌నర్‌షిప్' భూమి మీద డిజిటల్ సమస్యకు పరిష్కరించేలా చంద్రుడిని ఉపయోగించుకునే అవకాశం ఉందో లేదో చూడాలంటూ..

చంద్రుడిపై వైఫై నెట్‌వర్క్‌.. నాసా ప్రయోగం

వాషింగ్టన్: చంద్రుడిపై వైఫై నెట్‌వర్క్ ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉంది అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా. దీని కోసం చంద్రుడిపైకి ఆస్ట్రోనాట్స్‌ను పంచించారు. దీని ద్వారా భూమిపై తెలెత్తే సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని నాసా గ్లాన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ టెక్నాలజీ ఇంక్యేబేషన్‌ సెంటర్‌ డైరక్టర్‌ మ్యారి లోబో తెలిపారు. ఈ సందర్భంగా ఒలేసన్‌ మాట్లాడుతూ క్లీవ్‌ ల్యాండ్‌లో పరిసరాలకు తగ్గట్లు ఆర్టెమిస్ ప్రాజెక్ట్‌లో చంద్రుడి మీద నుంచి వైఫై సౌకర్యాన్ని అందించేలా బ్లూప్రింట్‌ తయారు చేస్తామని చెప్పారు. అదే సమయంలో చంద్రుడిపై ఉన్న అధిక ఉష్ణోగ్రతలో సైతం చంద్రుడి మీద నుంచి ధూళి, రాళ్లతో పాటు వైఫై నెట్‌ వర్క్‌లకు అక్కడి వాతావరణం అనుకూలిస్తుందా అనే విషయాలపై రీసెర్చ్‌ చేస్తామన్నారు.


'క్లీవ్‌ల్యాండ్‌'లో దాదాపు 31శాతం  కుటుంబాలకు ఇంటర్నెట్‌ సదుపాయం లేదు. అయితే ఈ సమస్య పరిష్కారం కోసం ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ 'గ్రేటర్ క్లీవ్‌ల్యాండ్ పార్ట్‌నర్‌షిప్' భూమి మీద డిజిటల్ సమస్యకు పరిష్కరించేలా చంద్రుడిని ఉపయోగించుకునే అవకాశం ఉందో లేదో చూడాలంటూ నాసాకి చెందిన గ్లెన్ రీసెర్చ్ సెంటర్‌ని సంప్రదించారు. దీంతో నాసా గ్లెన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ కంపాజ్‌ బృందం.. చంద్రమండలంపై ఉన్న లూనార్‌ సర్ఫేస్‌ ఏరియా ప్రాంతంలోని వైఫై నెట్‌‌వర్క్‌ నుంచి కింద ఉన్న క్లీవ్‌ల్యాండ్‌కు అందించేలా ఇక్కడి భూ వాతావరణం ఎంతమేరకు సహకరిస్తుందనే అంశంపై విశ్లేషణ జరిపినట్లు స్టీవ్ ఒలెసన్ వెల్లడించారు.

Updated Date - 2021-10-19T02:13:33+05:30 IST