అంగారకుడిపై ఎగరనున్న హెలికాఫ్టర్!

ABN , First Publish Date - 2021-04-10T18:29:33+05:30 IST

నాసా ప్రయోగించిన ఇన్‌జెన్యూనిటీ హెలికాఫ్టర్ తన పని ప్రారంభించబోతోంది.

అంగారకుడిపై ఎగరనున్న హెలికాఫ్టర్!

అంగారక గ్రహంపై పరిస్థితులను తెలుసుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రయోగించిన ఇన్‌జెన్యూనిటీ హెలికాఫ్టర్ తన పని ప్రారంభించబోతోంది. పైకి ఎగిరేందుకు సిద్ధమవుతోంది. ఆదివారం నాడు ఈ హెలికాఫ్టర్ అంగారక గ్రహం ఉపరితం నుంచి పైకి ఎగరనున్నట్టు నాసా వెల్లడించింది. హెలికాఫ్టర్ రోటార్ల పనితీరును ఇప్పటికే పరీక్షించినట్టు నాసా పేర్కొంది. ఈ హెలికాఫ్టర్ పైకి ఎగురుతూ పర్సెవరెన్స్ రోవర్ ఫొటోలు తీయనుంది. 


`భూమితో పోలిస్తే అంగారకుడిపై గురుత్వాకర్షణ తక్కువగా ఉండడం వల్ల హెలికాఫ్టర్ ల్యాండింగ్, పైకి ఎగరడం కాస్త కష్టమవుతుంది. అయినా ఎలాంటి సాంకేతిక సహకారం లేకుండానే ఇన్‌జెన్యూనిటీ హెలికాఫ్టర్ అక్కడి వాతావరణాన్ని తట్టుకోగలదు. ఇప్పటికే హెలికాఫ్టర్ పనితీరును సమీక్షించాం. దాని రోటార్ల పనితీరును పరీక్షించాం. ఈ హెలికాఫ్టర్ ద్వారా అంగారక గ్రహంపై ఉండే పరిస్థితులకు సంబంధించిన విలువైన డేటాను పొందవచ్చ`ని ప్రాజెక్ట్ మేనేజర్ అంగ్ పేర్కొన్నారు. 



Updated Date - 2021-04-10T18:29:33+05:30 IST