Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘నాసా’ నుంచి ఒలింపిక్ వెలుగుల పిక్... చూసి తీరాల్సిందే!

న్యూఢిల్లీ: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటో అత్యంత వేగంగా వైరల్ కావడానికి తోడు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. టోక్యోలోని ఒలింపిక్ గ్రామంలో రాత్రవేళ కనువిందు చేసే వెలుగుల సోయగాలకు సంబంధించిన చిత్రాన్ని సానా షేర్ చేసింది. 

 ఈ చిత్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)కు చెందిన వింటేజ్ పాయింట్ నుంచి సేకరించారు. ఈ ఫొటోలో ఒలింపిక్ క్రీడలు జరుగుతున్న ప్రాంతం విద్యుత్ కాంతులలో వెలిగిపోతుండటాన్ని గమనించవచ్చు.  నాసా షేర్ చేసిన ఈ చిత్రానికి ఇప్పటివరకూ ఆరు లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి. కాగా జూలై 23న ప్రారంభమైన ఒలింపిక్ క్రీడలు ఆగస్టు 8 వరకూ జరగనున్నాయి. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement