6800 ఏళ్లకోసారి కనిపించే తోకచుక్క.. ఫొటోలు షేర్ చేసిన నాసా!

ABN , First Publish Date - 2020-07-12T04:26:58+05:30 IST

6800 ఏళ్లకోసారి కనిపించే ఓ తోకచుక్క ఫొటోలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) షేర్ చేసింది.

6800 ఏళ్లకోసారి కనిపించే తోకచుక్క.. ఫొటోలు షేర్ చేసిన నాసా!

వాషింగ్టన్: 6800 ఏళ్లకోసారి కనిపించే ఓ తోకచుక్క ఫొటోలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) షేర్ చేసింది. 21వ శతాబ్దంలో మామూలు కళ్లతో చూడగలిగే అతికొద్ది తోకచుక్కల్లో ఇది ఒకటి. దీనిపేరు నియోవైజ్. ఈ తోకచుక్క తన కక్ష్యలో పూర్తిగా ఓ రౌండ్ కొట్టడానికి 6,800 సంవత్సరాలు పడుతుందట. అమెరికాలోని టక్సన్ ప్రాంతంలో సూర్యోదయానికి కొన్ని క్షణాల ముందుగా కనిపించిన ఈ తోకచుక్కను ఫొటోలు తీశారు. మార్చి నెల చివర్లో ఈ తోకచుక్కను గుర్తించినట్లు చెప్పిన నాసా.. టక్సన్‌కు ఈశాన్యంగా ఇది కనిపించిందని తెలిపింది.

Updated Date - 2020-07-12T04:26:58+05:30 IST