సెంటినెల్‌-6 ఉపగ్రహాన్ని పంపిన నాసా

ABN , First Publish Date - 2020-11-23T07:50:46+05:30 IST

సముద్ర మట్టాల్లో వస్తున్న మార్పులను పర్యవేక్షించేందుకు అమెరికాకు చెందిన నాసా ఓ ఉపగ్రహాన్ని పంపింది. సెంటినెల్‌-6 మైకేల్‌ ఫ్రెలిచ్‌ అనే ఈ శాటిలైట్‌ను స్పేస్‌ ఎక్స్‌ ఫాల్కన్‌-9 రాకెట్‌కు అనుసంధానించి

సెంటినెల్‌-6 ఉపగ్రహాన్ని పంపిన నాసా

కాలిఫోర్నియా, నవంబరు 22: సముద్ర మట్టాల్లో వస్తున్న మార్పులను పర్యవేక్షించేందుకు అమెరికాకు చెందిన నాసా ఓ ఉపగ్రహాన్ని పంపింది. సెంటినెల్‌-6 మైకేల్‌ ఫ్రెలిచ్‌ అనే ఈ శాటిలైట్‌ను స్పేస్‌ ఎక్స్‌ ఫాల్కన్‌-9 రాకెట్‌కు అనుసంధానించి కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ నుంచి శనివారం విజయవంతంగా ప్రయోగించారు. సుమారు 30 ఏళ్ల పాటు పనిచేసే ఈ ఉపగ్రహం సముద్ర మట్టాల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. వాతావరణ సమాచారం, సముద్రాల్లో నౌకలకు నావిగేషన్‌ కోసం ఇది ఉపయోగపడనుంది. ఆగస్టులో చనిపోయిన నాసా ఎర్త్‌ సైన్స్‌ విభాగాధిపతి మైకేల్‌ ఫ్రెలిచ్‌ పేరును దీనికి పెట్టారు.

Updated Date - 2020-11-23T07:50:46+05:30 IST