ఔను.. నాసానే మమ్మల్ని కాపాడింది: ఈలాన్ మస్క్

ABN , First Publish Date - 2021-08-08T02:49:29+05:30 IST

. ఆ సమయంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇచ్చిన కాంట్రాక్ట్‌ను గెలుచుకోవడంతో తాము కష్టాల నుంచి బయటపడ్డామని పేర్కొన్నారు.

ఔను.. నాసానే మమ్మల్ని కాపాడింది: ఈలాన్ మస్క్

వాషింగ్టన్: అపరకుబేరుడిగా, టెక్ ఆంత్రప్రెన్యూర్‌గా ఈలాన్ మస్క్ మనందరికీ పరిచయమే. టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థలను ఆయన విజయ పథంలో నడిపిస్తున్నారు. ముఖ్యంగా..అంతరిక్ష రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న ప్రైవేటు సంస్థగా స్పేస్‌ఎక్స్ ఎంతో పేరుగాంచింది. అయితే..స్పేస్‌ఎక్స్ భవిష్యత్తుపై ఈలాన్ ఒకానొక దశలో ఆందోళన చెందారంటే అసలేమాత్రం నమ్మలేం. కానీ ..ఇదే నిజం! ఈ విషయాన్ని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా తెలిపారు. ఆ సమయంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇచ్చిన 1.5 బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్‌ను గెలుచుకోవడంతో తాము కష్టాల నుంచి బయటపడ్డామని పేర్కొన్నారు. నాసా సంస్థే స్పేస్ఎక్స్‌ను ఆర్థికంగా కాపాడిందని వెల్లడించారు. 

Updated Date - 2021-08-08T02:49:29+05:30 IST