నర్సీపట్నం జిల్లా కేంద్రం చేయాలి

ABN , First Publish Date - 2022-01-29T06:07:54+05:30 IST

నర్సీ పట్నం జిల్లా కేంద్రం చేయాలని పలువురు ప్రజాప్రతినిధులు, విలేఖరులు చర్చా వేదికలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నర్సీపట్నం జిల్లా కేంద్రం అంశంపై ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం ప్రజాప్రతినిధులు, విలేఖరులతో చర్చా వేదిక ఏర్పాటైంది.

నర్సీపట్నం జిల్లా కేంద్రం చేయాలి
చర్చా వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే గణేశ్‌, పలువురు ప్రజాప్రతినిధులు

 పలువురు ప్రజాప్రతినిధుల అభిప్రాయం 

 ఇప్పటికే  మూడు పర్యాయాలు సీఎం వద్ద ప్రస్తావన 

 చర్చా వేదికలో ఎమ్మెల్యే గణేశ్‌ 

నర్సీపట్నం, జనవరి 28: నర్సీ పట్నం జిల్లా కేంద్రం చేయాలని పలువురు ప్రజాప్రతినిధులు, విలేఖరులు చర్చా వేదికలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నర్సీపట్నం జిల్లా కేంద్రం అంశంపై ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌  క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం ప్రజాప్రతినిధులు, విలేఖరులతో చర్చా వేదిక ఏర్పాటైంది. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సీపట్నం జిల్లా కేంద్రంగా కావాలని 2019 నుంచి నేటివరకు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి, జిల్లా మంత్రి దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. ప్రభుత్వానికి భారం కాకుండా జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేం దుకు అవసరమైన స్థలాలు, ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పార్లమెంట్‌ నియోజవర్గం కేంద్రంగా జిల్లా ఏర్పాటుపై ఫిబ్రవరి 26న అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలియజేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలిసి నర్సీపట్నం జిల్లా కేంద్రం చేయాలని కోరనున్నట్టు చెప్పారు. నాతవరం మండల నాయకుడు అంకంరెడ్డి జమీలు మాట్లాడుతూ పార్లమెంటు స్థానం పరిధిలోని మిగిలిన ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవడం అవసరమన్నారు. మాకరపాలెం ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, జడ్పీటీసీ సుర్ల గిరిబాబు, కార్పొరేషన్‌ డైరెక్టర్లు షేక్‌ ఉన్నీషాబేగం, అర్జున్‌ వెంకట్రావు, కర్రి శ్రీనివాసరావు, వైసీపీ నాయకుడు కోనేటి రామకృష్ణ, సుర్ల సత్యనారాయణ తదితరులు నర్సీపట్నం జిల్లా చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ చిటికెల భాస్కరనాయుడు, ఎంపీపీలు సుర్ల రాజేశ్వరి, సాగిన లక్ష్మణమూర్తి, గజ్జలపు మణికుమారి, జడ్పీటీసీలు సత్యవేణి, సుర్ల గిరిబాబు, కాపారపు అప్పలనర్స, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ గొలుసు నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T06:07:54+05:30 IST