నర్సీపట్నాన్ని జిల్లా కేంద్రం చేయాలి

ABN , First Publish Date - 2022-01-28T06:31:01+05:30 IST

నర్సీ పట్నాన్ని జిల్లా కేంద్రం చేయాలని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ కోరారు. ఈ మేరకు గురువారం విశా ఖలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్‌ మల్లికార్జునలను కలిసి వినతి పత్రం అందజేశారు.

నర్సీపట్నాన్ని జిల్లా కేంద్రం చేయాలి
మంత్రికి వినతిని అందిస్తున్న గణేశ్‌

  మంత్రి ముత్తంశెట్టి,  కలెక్టర్‌కు ఎమ్మెల్యే గణేశ్‌ వినతి

నర్సీపట్నం, జనవరి 27 : నర్సీ పట్నాన్ని జిల్లా కేంద్రం చేయాలని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ కోరారు. ఈ మేరకు గురువారం విశా ఖలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్‌ మల్లికార్జునలను కలిసి వినతి పత్రం అందజేశారు. అనకాపల్లి జీవీఎంసీలో ఉన్నందున ఆ ప్రాంతాన్ని జిల్లా చేస్తే జీవీఎంసీ పరిధిలో రెండు (విశాఖ, అనకాపల్లి) జిల్లాలు ఉన్నట్టవుతుందని వివరిం చారు. బాగా వెనుకబడి ప్రాంతంగా ఉన్న నర్సీపట్నం జిల్లా కేంద్రం చేయడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. అంతేకాకుండా నర్సీపట్నంలో ప్రభుత్వ కార్యాలయాలకు 90 శాతం సొంత భవనాలు ఉన్నాయన్నారు.  కార్యాలయ భవనాలు కొత్తగా నిర్మించే అవసరం లేదని నర్సీపట్నంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ భవనాలు సరిపోతాయని తెలిపారు. నియోజవర్గంలో 2000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని చెప్పారు. 

Updated Date - 2022-01-28T06:31:01+05:30 IST