ఎస్‌ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నరోత్తంరెడ్డి

ABN , First Publish Date - 2022-07-04T06:19:53+05:30 IST

స్కూల్‌ అసిస్టెంట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన నరోత్తంరెడ్డి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎస్‌ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నరోత్తంరెడ్డి
నరోత్తంరెడ్డి

చిత్తూరు (సెంట్రల్‌), జూలై 3: స్కూల్‌ అసిస్టెంట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన నరోత్తంరెడ్డి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలో ని ఎస్‌ఏ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా శరత్‌బాబు (ప్రకాశం), ప్రధాన కార్యదర్శిగా సుబ్బారావు (బాపట్ల), కోశాధికారిగా గోవిందప్ప(అనంతపురం), మహిళా అధ్యక్షురాలుగా పద్మ (గుంటూరు), కార్యదర్శిగా సుజాత(విశాఖ)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


Updated Date - 2022-07-04T06:19:53+05:30 IST