నార్కట్‌పల్లి టూ బీదర్‌

ABN , First Publish Date - 2021-06-24T07:14:30+05:30 IST

సాధారణంగా చెరువుల్లో నాచు, ఇతరాలపై ఆధారపడి చేపలను పెంచుతుం టారు. అయితే క్యాట్‌ ఫిష్‌ మాత్రం నాచును, ఇతర పదార్థాలను తినకుం డా, పూర్తిగా కుళ్లిన జీవరాశులను, వ్యర్థ పదార్థాలను తిని జీవిస్తుంటాయి. ఈ చేపలను తింటే ప్రజలు అనారోగ్యం పాలవుతారు. మత్స్యశాఖ అధికారులు పట్టించుకో కపోవడంతో కొందరు చేపల అక్రమ వ్యాపారులు అడ్డదారిలో లక్షల రూ పాయలు ఆర్జిస్తున్నారు.

నార్కట్‌పల్లి టూ బీదర్‌
చౌటుప్పల్‌లో వాహనం బోల్తా పడటంతో చేపలను ఏరుకుంటున్న ప్రజలు

జిల్లాలో రహస్యంగా  క్యాట్‌ ఫిష్‌  దందా 

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం 

సాధారణంగా చెరువుల్లో నాచు, ఇతరాలపై ఆధారపడి చేపలను పెంచుతుం టారు. అయితే క్యాట్‌ ఫిష్‌ మాత్రం నాచును, ఇతర పదార్థాలను తినకుం డా,  పూర్తిగా కుళ్లిన జీవరాశులను, వ్యర్థ పదార్థాలను తిని జీవిస్తుంటాయి.  ఈ చేపలను తింటే  ప్రజలు అనారోగ్యం పాలవుతారు. మత్స్యశాఖ అధికారులు పట్టించుకో కపోవడంతో కొందరు చేపల అక్రమ వ్యాపారులు అడ్డదారిలో లక్షల రూ పాయలు ఆర్జిస్తున్నారు.  – (ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ)

నిషేధిత క్యాట్‌ ఫిష్‌ను మూసీ పరివాహక ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా పెంచుతున్నారు. ఆరోగ్యానికి హాని చేసే చేపలు కావడంతో, ప్రభుత్వాలు గతంలో నిషేధించాయి. కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమబెం గాల్‌ రాష్ర్టాల్లో ఈ చేపలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. చూడటానికి కొర్ర మీను చేపలను పోలి ఉండడంతో, ప్రజలు వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ధర తక్కువగా ఉండడంతో, క్యాట్‌ ఫిష్‌ చేపలను ఆయా రాష్ర్టాల్లో కొనుగోలు చేస్తారు. చేపల వ్యాపారులు ఈ చేపలను మూసీ పరివాహక, ఆంధ్రా ప్రాంతాల్లో కొనుగోలు చేసి విక్ర యిస్తున్నారు. ధర తక్కువగా ఉండి, త్వరగా పెరిగే గుణం ఉండడంతో, ఈ చేపలను వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేసి అధిక ధరకు విక్ర యించి, లాభా లు గడిస్తున్నారు. బొలేరో, మినీ వాహనాల్లో నిత్యం వేలాది టన్నుల నిషేధిత క్యాట్‌ ఫిష్‌ చేపలు అక్రమ రవాణా చేస్తు న్నారు. ఈ చేపల విక్రయాలపై సరైన నిఘా లేకపోవడంతో, చేపల అక్రమ వ్యాపారులు యథేచ్చగా ఇతర రాష్ర్టాలకు రవాణా చేస్తున్నారు. పోలీసులు కూడా పట్టించు

కోకపోవడంతో ఈ దందా కొనసాగుతోంది. 

తెరపైకి వచ్చిన నార్కట్‌పల్లి అక్రమ దందా..

చౌటుప్పల్‌ మండలం అంకిరెడ్డిగూడెం వద్ద వాహనం బోల్తా పడ డంతో క్యాట్‌ ఫిష్‌  అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. అప్పటివరకు ఈ చేపలను కొర్రమీనుగా భావించిన ప్రజలు పెద్ద ఎత్తున ఎత్తుకెళ్లారు. లూటీ జరిగిన అనంతరం పోలీసులు విచారణ చేయగా క్యాట్‌ ఫిష్‌గా తెలిసింది. వాహన డ్రైవర్‌, క్లీనర్‌ తాము నార్కట్‌పల్లి నుంచి  కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌కు క్యాట్‌ ఫిష్‌ను తీసుకువెళుతున్నట్లు చెప్పడంతో అం దరి దృష్టి నార్కట్‌పల్లి మండలంపై పడింది. ఇటీవల చాలామంది చేపల పెంచుతున్నందున అధికారుల నియంత్రణ కరువైంది. వీటి పెంపకానికి పెద్ద ఎత్తున సబ్సిడీలు  వస్తున్నప్పటికీ  కొంతమంది రాజకీయ నాయ కుల మద్దతుతో  నకిలీ బిల్లులు పెడుతూ నగదు డ్రా చేస్తున్నట్లు సమా చారం.  ఈ స్వాహా పర్వానికి మత్య్సశాఖలో కొంత మంది అధికారులు  సహకరిస్తున్నట్లు తెలిసింది. క్యాట్‌ ఫిష్‌ పెంపకం వ్యవహారం మూసీ పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున సాగుతున్న ప్పటికీ నల్లగొండ జిల్లా మత్యశాక అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. 

ఇప్పటి వరకు మాదృష్టికి రాలేదు

జిల్లాలో క్యాట్‌ ఫిష్‌ను పెంచుతున్నారని ఇప్పటివరకు మా దృష్టికి రాలేదు.  చౌటుప్పల్‌ ఘటన గురించి మాకు ఎలాంటి వివరాలు లేవు. నార్కట్‌పల్లి పరిసరాల్లో, మూసీ ప్రాజెక్టు పరిధిలో అక్కడక్కడ క్యాట్‌ ఫిష్‌ లభ్యమవుతుండగా వెంటనే వాటిని గుర్తించి వాటిని పూడ్చివేయిస్తున్నాం.     

   – చరిత, మత్స్యశాఖ అధికారి


Updated Date - 2021-06-24T07:14:30+05:30 IST