Abn logo
Mar 2 2021 @ 13:53PM

'నాంది' నేర్పిన గుణపాఠం

తెలుగు సినిమా ధోరణి మారుతోంది.  దాదాపుగా మారిపోయింది. ప్రపంచ సినిమాకి తెలుగువాళ్ళు బాగా దగ్గరైపోయారు. నెట్ ధియేటర్‌లో అన్ని భాషా చిత్రాలు.. అరువుగా కొన్ని, కొనుక్కుని కొన్ని...మొత్తానికి అన్నీ చూసేస్తున్నారు. రమారమి అన్నీ చూసేశారు మొన్న లాక్‌డౌన్‌ టైంలో. ఇంకా మేము ప్రేమిస్తాం....పాటలు పాడి, డాన్స్‌లు చేసి మురిపిప్తాం....మైమరిపిస్తాం అన్న రొటీన్‌ ప్రామిస్‌లను కట్టిపెట్టాలి. కొత్త కథలకి తెరతీయాలి. కొ్త్తదర్శకలను ఆశ్రయించాలి. రొటీన్‌ ఫార్ములాలు, రొడ్డకొట్టుడు ప్రేమలు తట్టుకునే స్థితిలో తెలుగు ప్రేక్షకులు లేరన్న కఠోరవాస్తవాన్ని అందరూ గుర్తించాలి. ఒకవేళ ప్రేమకథా చిత్రమే అయినప్పటికీ కూడా, ఉప్పెన సినిమాలా అంత సీరియస్‌ ట్రీట్‌మెంట్‌ ఉంటేనే జనాలకి ఎక్కుతోంది. లేకపోతే ఎంత పెద్ద యాక్టర్‌ చేసినా సినిమాలు లేచిపోతున్నాయి. ఆడియన్స్ ఈరోజున కఠినంగా వ్యవహరిస్తున్నారు. ధియేటర్లా...చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. ఓ వైపు ఓటిటి...మరోవైపు రెంట్లు.....ఇంకో వైపు డిస్ట్రిబ్యూటర్ల ఉచ్చులో థియేటర్లు దినదినగండం దీర్ఘాయుష్షులా బతుకుతున్నాయి. ఈ టైంలో హీరోల సినిమాలు కొత్తగా లేకపోతే అందరికీ ఆయువు చెల్లిపోతుంది.

'నాంది, ఉప్పెనలాంటి' సినిమాలు తెలుగు చిత్రపరిశ్రమకి దిశానిర్దేశం చేశాయి. 'కె.జి.యఫ్‌'..ఎవడు తీశాడో తెలియదు...ఎవడు నటించాడో తెలియదు....విడుదలయ్యేవరకూ అంతా ఓ గోడ. విడుదలైన తర్వాత చూస్తే జనం హారతులు పట్టారు. సినిమా చూసి కళ్లు తిరిగిన తర్వాత ప్రశాంత్‌నీల్‌ కనిపించాడు....యశ్‌ తెలిసొచ్చాడు. అప్పడింక ప్రశాంత్‌నీల్‌ మొబైల్‌, కాల్స్‌తో పేలిపోవాల్సివచ్చింది. ఒకరి తర్వాత మరొకరు....చివరికి నీల్‌ బాబోయ్‌ ఇంక నావల్ల కాదు అన్నంతవరకూ అతనిని నిద్రపోనివ్వలేదు. కొత్త సినిమా కావాలి. కానీ ఎవరో తెస్తే, ఎవరో తీస్తే....అప్పుడు మనకు కావాలి. ఆ మధ్య కేరాఫ్ కంచరపాలెం సినిమా దర్శకుడు అంతే. కళ్ళ ముందుకొచ్చేవరకూ జడ్జ్ చేయలేకపోతే అది చాలా బాధాకరం. కథ టైంలో స్టాండర్డ్ ఫార్ములాల వెంటే పరిగెడితే చితరికి మిగిలేది అశనిపాతమే. అందుకే ఇప్పడు కొందరు హీరోలు మాకు లవ్‌ స్టోరీలు వద్దు....డిఫరెంట్‌ సినిమాలు చేస్తామని స్టేట్‌మెంట్లు గుప్పిస్తున్నారు. ఎన్నో కథలు....మరెన్నో ట్రీట్‌మెంట్లు...కొత్త వైపుకి పరిశ్రమ అడుగులు వేయాలి. నాంది ఒక ఉదాహరణ మాత్రమే. నిజంగా చెవి ఒగ్గితే....ఎన్నో నాందిలు వస్తాయి. ఆదరిస్తే ఎన్నో, ఎన్నెన్నో వండర్స్ తెలుగు సినిమాని సుసంపన్నం చేస్తాయి.  

Advertisement
Advertisement
Advertisement