రిమ్స్‌ సీఐగా నరేంద్రరెడ్డి బాధ్యతలు

ABN , First Publish Date - 2021-07-26T05:11:57+05:30 IST

కడప రిమ్స్‌ పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టరుగా నరేంద్రరెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 2004 బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రస్తుతం రాజంపేట రూరల్‌ సీఐగా విధులు నిర్వహిస్తూ రిమ్స్‌ పీఎస్‌కు బదిలీపై వచ్చారు.

రిమ్స్‌ సీఐగా నరేంద్రరెడ్డి బాధ్యతలు
బాధ్యతలు స్వీకరిస్తున్న సీఐ నరేంద్రరెడ్డి

కడప(క్రైం), జూలై 25: కడప రిమ్స్‌ పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టరుగా నరేంద్రరెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 2004 బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రస్తుతం రాజంపేట రూరల్‌ సీఐగా విధులు నిర్వహిస్తూ రిమ్స్‌ పీఎస్‌కు బదిలీపై వచ్చారు. గతంలో రెడ్‌శ్యాండిల్‌ టాస్క్‌ఫోర్స్‌లో కూడా ఈయన విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిమ్స్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు తీసుకుంటామని, ఎస్పీ అన్బురాజన్‌ ఆదేశాలు, కడప డీఎస్పీ సూచనల మేరకు విధులు నిర్వహిస్తామన్నారు. కాగా, ఇక్కడ పనిచేస్తున్న సీఐ సత్యబాబు జిల్లా హెడ్‌క్వార్టర్‌లో రిపోర్టు చేసుకున్నారు. 

Updated Date - 2021-07-26T05:11:57+05:30 IST