Prime Minister: నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా వెలుగుచూసిన అరుదైన చిత్రాలు

ABN , First Publish Date - 2022-09-17T13:09:50+05:30 IST

మన దేశ ప్రధానమంత్రి(Prime Minister) నరేంద్ర మోదీ(Narendra Modi) శనివారం జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు.ప్రధాని మోదీకి నేటితో 72 ఏళ్లు నిండాయి....

Prime Minister: నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా వెలుగుచూసిన అరుదైన చిత్రాలు

న్యూఢిల్లీ: మన దేశ ప్రధానమంత్రి(Prime Minister) నరేంద్ర మోదీ(Narendra Modi) శనివారం జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు.ప్రధాని మోదీకి నేటితో 72 ఏళ్లు నిండాయి. ప్రధానమంత్రికి సంబంధించిన అత్యంత అరుదైన,ఎవరూ చూడని చిత్రాలను(rare and unseen pictures) జన్మదినోత్సవం సందర్భంగా ఇస్తున్నాం.ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడిగా మోదీ దేశ, విదేశాల్లో అపారమైన ప్రజాదరణ పొందారు.ప్రధాని నరేంద్రమోదీ బాల్యం నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, ప్రధానమంత్రి పదవి దాకా ఎన్నెన్నో ఘట్టాలకు సంబంధించిన అరుదైన చిత్రాలను మీరూ తిలకించండి...



బాలీవుడ్ నటులు ఖాన్ త్రయంతో మోదీ చిత్రాలు

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్, మరో బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ లతో కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెల్ఫీ దిగిన చిత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గుజరాత్ రాష్ట్రంలో నరేంద్రమోదీ మరో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తో కలిసి గాలిపటం ఎగురవేస్తున్న చిత్రం వెలుగుచూసింది. 


విద్యార్థి దశలో నరేంద్రమోదీ ఎన్‌సీసీలో చేరి యూనిఫాంతో కూర్చున్న చిత్రం విశేషంగా ఆకట్టుకుంటోంది. 


యువకుడిగా మోదీ ద్విచక్రవాహనంపై చక్కర్లు కొట్టిన పాత చిత్రం తాజాగా వెలుగుచూసింది. ఎమర్జెన్సీ సమయంలో మోదీ వేషం మార్చి సర్దార్జీగా గడ్డం, తలపాగా, కళ్లజోడు పెట్టుకొని ఉన్న చిత్రం కూడా బయటపడింది. 


నెత్తిన కాషాయం టోపి పెట్టుకొని, నిక్కరు ధరించి ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న మోదీ చిత్రం ప్రచారక్ లను విశేషంగా ఆకట్టుకుంటోంది. 


గుడిసెల్లో నివాసముంటున్న పేద ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న మోదీ చిత్రం అతని సేవలకు దర్పణం పడుతోంది. జమ్మూకశ్మీరులోని దేశ సరిహద్దుల్లో స్నేహితులతో కలిసి కూర్చొని సమాలోచనలు జరుపుతున్న మోదీ చిత్రం వెలుగుచూసింది.


 మొత్తం మీద 72 ఏళ్ల వయసులో అడుగిడిన మోదీ చలాకీగా ప్రధాని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీతో కలిసి ఉన్న మోదీ చిత్రం వెలుగుచూసింది. మోదీ జన్మదినోత్సవం సందర్భంగా అతని అరుదైన చిత్రాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 





Updated Date - 2022-09-17T13:09:50+05:30 IST