అభివృద్ధిలో దూసుకెళ్లాలి

ABN , First Publish Date - 2022-01-23T06:05:02+05:30 IST

అభివృద్ధిలో దూసుకెళ్లాలి

అభివృద్ధిలో దూసుకెళ్లాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ప్రధాని మోదీ

నీతి ఆయోగ్‌ సహకారంతో పురోగతి సాధించాలి

సమాఖ్య స్ఫూర్తితో ముందడుగు వేయాలి

వెనుకబడిన జిల్లాల కలెక్టర్లతో ప్రధాని మోదీ

ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ 

భూపాలపల్లి కలెక్టరేట్‌, జనవరి 22: దేశంలోని అభి వృద్ధి జిల్లాలకు సమానంగా మిగతా జిల్లాలు కూడా పురోగతిని సాధించాలని ప్రధాని మోదీ అన్నారు. ఫెడ రల్‌ (సమాఖ్య) స్ఫూర్తితో దూసుకెళ్లాలన్నారు. నీతి ఆయోగ్‌ సహకారంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా లను ముమ్మరం చేయాలని వెనుకబడిన జిల్లాల కలెక్టర్టకు సూచించారు.  నీతి ఆయోగ్‌ సీఈవో అమితా బ్‌ కాంత్‌తో కలిసి న్యూఢిల్లీ నుంచి ప్రధాని శనివారం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విద్య, వైద్యం, పౌష్టి కాహారం, వృత్తి నైపుణ్యత, గ్రామీణాభివృద్ధి, పశుసంవ ర్థకం, వ్యవసాయం తదతర అంశాలపై కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో కలిసి సమీక్షించారు. సమాఖ్య స్ఫూర్తితో దేశంలోని అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో నీతి ఆయోగ్‌ ద్వారా దేశవ్యాప్తంగా అత్యంత వెనుకబడిన 112 జిల్లాలను గుర్తించామన్నారు.  ఈ జిల్లాల్లో విద్య, వైద్యం, పౌష్టికా హారం, పశుసంవర్థకం, వృత్తి నైపుణ్యం, వ్యవసాయం, అనుబంధ రంగాలను అభివృద్ధి పర్చడంతోపాటు ఆర్థిక తోడ్పాటు, మౌలిక సౌకర్యాల కల్పనకు చర్యలు పట్టినట్టు తెలిపారు. నీతి ఆయోగ్‌ సూచించిన రంగాల్లో అవసరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అంకి తభావంతో చేపట్టి ప్రజల జీవన ప్రమాణాలు మెరు గుపడేలా కృషి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.  నీతి ఆయోగ్‌ అధికారులు క్రమం తప్పకుండా జిల్లా అధికారులతో సమావేశాలు నిర్వహించి అభివృద్ధి కార్య క్రమాలను వేగవంతం చేయాలన్నారు. ఈ సమా వేశంలో కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా, అదనపు కలెక్టర్‌ దివా కర, నీతి ఆయోగ్‌ జిల్లా అధికారి రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-23T06:05:02+05:30 IST