నేడు వారణాసిలో పర్యటించనున్న ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2020-11-30T12:05:57+05:30 IST

భారత ప్రధాని నరేంద్రమోదీ నేడు వారణాసిలో పర్యటించనున్నారు. ఇప్పటికే సెక్యూరిటీ అధికారులు మోదీ పర్యటించే ప్రాంతాల్లో తనిఖీలు...

నేడు వారణాసిలో పర్యటించనున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీ నేడు వారణాసిలో పర్యటించనున్నారు. ఇప్పటికే సెక్యూరిటీ అధికారులు మోదీ పర్యటించే ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. పర్యటన సందర్భంగా వారణాసి-ప్రయాగ్‌రాజ్ సిక్స్ లేన్ హైవేను మోదీ ప్రారంభించనున్నారు. 73 కిలోమీటర్ల పొడవు గల ఈ హైవేను రూ. 2,447 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ హైవే ప్రారంభంతో ప్రయాగ్‌రాజ్, వారణాసి మధ్య రోడ్డు ప్రయాణం గంటసేపు తగ్గనుంది. నేడు కార్తీక పౌర్ణమి కావడంతో వారణాసిలో దేవ్ దీపావళి వేడుకలను మోదీ ప్రారంభించనున్నారు. కార్తీక పౌర్ణమి నాడు దేవ్ దీపావళి పండుగను జరుపుకుంటారు. సోమవారం గంగానదికి ఇరువైపులా 11 లక్షల దీపాలను వెలిగించనున్నారు. మొదటి దీపాన్ని ప్రధాని మోదీ వెలిగించి ఈ వేడుకను ప్రారంభిస్తారు. ఇక ఇదే పర్యటనలో కాశీ విశ్వనాథ్ టెంపుల్ కార్రిడార్ ప్రాజెక్టును సైతం మోదీ సందర్శించనున్నారు. అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చాయన్న విషయాలను మోదీ అడిగి తెలుసుకోనున్నారు. మరోపక్క కొద్ది రోజుల క్రితం మోదీ ప్రారంభించిన సార్నాథ్ ఆర్కియాలాజికల్ సైట్‌లో జరిగే లైట్ అండ్ సౌండో షోలో కూడా ఆయన పాల్గొంటారు.

Updated Date - 2020-11-30T12:05:57+05:30 IST