Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 22 2021 @ 06:08AM

20 ఏళ్ల వయసులోనే ఇంటిని విడిచిపెట్టిన నరేంద్ర గిరి ఏం చేశారంటే...

ప్రయాగ్‌రాజ్: అఖిల భారత అఖాడా పరిషత్ అధ్యక్షులు మహంత్ నరేంద్ర గిరి మృతిపై శోక సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. మహంత్ నరేంద్ర గిరి మృతిపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆయన స్వగ్రామంలో మౌనం తాండవిస్తోంది. నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకున్నారనే వాదనను ఆయన కుటుంబీకులు అంగీకరించడం లేదు. నరేంద్ర గిరి సుమారు 60 ఏళ్ల క్రితం యూపీలోని ప్రయాగ్‌రాజ్ జిల్లా ప్రతాప్ పూర్ బ్లాక్ పరిధిలోని ఛతౌనా గ్రామంలో జన్మించారు. 

నలుగురు సోదరులు, ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్న కుటుంబంలో ఆయన రెండవవాడు. పెద్దన్నయ్య పేరు అశోక్ కుమార్. ఆ తరువాత అరవింద్ సింగ్, ఆనంద్ సింగ్‌తో పాటు అతనికి ఇద్దరు చెల్లెళ్లు ఊర్మిళా సింగ్, మంజూ సింగ్ ఉన్నారు. నరేంద్రగిరి అసలు పేరు నరేంద్ర ప్రతాప్ సింగ్. ఆయన బాల్యమంతా ఛతౌనా గ్రామంలోనే గడిచింది. ఇక్కడే ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నారు. ఆ తరువాత అమీపూర్‌లోని బాబూ సూరజ్ ప్రతాప్ ఇంటర్ కాలేజీలో 12 వ తరగతి వరకూ చదువుకున్నారు. నరేంద్ర గిరి తన 20 ఏళ్ల వయసులో ఇంటిని విడిచిపెట్టి సన్యాసం స్వీకరించారు. ఆ తరువాత నరేంద్ర గిరి ఎప్పుడూ తిరిగి ఇంటికి రాలేదు. అయితే కుంభమేళా సమయంలో కుటంబ సభ్యులే ఆయనను కలుసుకున్నారు. నరేంద్ర గిరి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆయన చిన్నప్పటి నుంచి ఎంతో శాంత స్వభావంతో నడుచుకునేవారు. ఇంటికి వచ్చే అందరితో స్నేహ పూర్వకంగా మెలిగేవారు. కాగా నరేంద్రగిరి ఆత్మహత్య చేసుకున్నారనే వార్తను నమ్మని అతని కుటుంబ సభ్యులు దీనిపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement