Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 24 2021 @ 11:57AM

delhi: నరేంద్రగిరి మృతి కేసులో సీబీఐ విచారణ

న్యూఢిల్లీ:  అఖిల భారతీయ అఖరా పరిషత్ చీఫ్ మహంత్ నరేంద్రగిరి మరణం కేసులో దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐ అంగీకరించింది. మహంత్ నరేంద్ర గిరి సోమవారం ప్రయాగరాజ్ నగరంలోని బాఘంబరి గడ్డి మఠంలోని తన గదిలో శవమై కనిపించాడు. ఉరి కారణంగా నరేంద్ర గిరి ఊపిరాడక మరణించినట్లు ప్రాథమిక శవపరీక్ష నివేదిక వెల్లడించింది.నరేంద్ర గిరి మరణంపై సీబీఐ విచారణకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు చేసింది.యూపీ పోలీసుల నుంచి కేసును స్వీకరించిన తర్వాత సీబీఐ కేసు దర్యాప్తు కోసం ఆరుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది.

‘‘నేను గౌరవంగా జీవించాను, అవమానంతో జీవించలేను, అందుకే నేను నా ఆత్మహత్య తీసుకుంటున్నాను’’ అని ఎనిమిది పేజీల సూసైడ్ లేఖను నరేంద్రగిరి రాశారు.మహంత్ నరేంద్రగిరిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై సందీప్ తివారీతో పాటు ఇద్దరు శిష్యులు ఆనంద్ గిరి ఆధ్య ప్రసాద్ లనే ముగ్గురు వ్యక్తులను యూపీ పోలీసులు అరెస్టు చేశారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement