Mahavira జయంతి రోజున మాంసం దుకాణాలా?

ABN , First Publish Date - 2021-11-01T17:44:36+05:30 IST

మహావీర్‌ జయంతి రోజున మాంసం దుకా ణాలు పనిచేస్తాయన్న రాష్ట్రప్రభుత్వ ప్రకటనపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి నారాయణన్‌ ఆది వారం

Mahavira జయంతి రోజున మాంసం దుకాణాలా?

బీజేపీ ఆగ్రహం

చెన్నై/పెరంబూర్‌: మహావీర్‌ జయంతి రోజున మాంసం దుకా ణాలు పనిచేస్తాయన్న రాష్ట్రప్రభుత్వ ప్రకటనపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి నారాయణన్‌ ఆది వారం విడుదల చేసిన ప్రకటనలో, రాష్ట్రంలో వళ్లలార్‌ వర్ధంతి, మహావీర్‌ జయంతి, తిరువళ్లువర్‌ వర్ధంతి తదితర రోజుల్లో మాంసం దుకాణాలు మూసివేయడం జరుగుతుందన్నారు. కానీ, ప్రస్తుతం ఈ నెల 4న మహావీర్‌ జయంతి రోజునే దీపావళి వస్తుండడంతో ప్రజల కోసం మాంసం దుకా ణాలు తెరిచేందుకు అనుమతిస్తామని ప్రభుత్వం పేర్కొనడం సరికాద న్నారు. అదే తిరువళ్లువర్‌ వర్ధంతి రోజున దీపావళి వస్తే ఇలాగే చేస్తారా? అంటూ ప్రశ్నించారు. మహావీర్‌ జయంతి రోజున మాంసం దుకాణాలు తెరవాలంటూ దాఖలైన పలు పిటిషన్లను మద్రాసు హైకోర్టు, సుప్రీంకోర్టు తోసిపుచ్చాయని నారాయణన్‌ గుర్తుచేశారు. ప్రభుత్వం ఈ విషయమై పునఃపరిశీలించాలని ఆయన  డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-11-01T17:44:36+05:30 IST