పాలకుల మనుగడ కోసమే.. ‘రాజద్రోహం’ కేసులు: ఆర్‌.నారాయణమూర్తి

ABN , First Publish Date - 2022-05-20T02:00:32+05:30 IST

స్వాతంత్య్ర పోరాటంలో భారతీయుల గొంతు నొక్కడానికి రాజద్రోహం చట్టాన్ని అమలు చేసిన బ్రిటిష్‌ వాళ్లే తమ దేశంలో ఈ చట్టాన్ని రద్దు చేశారు.

పాలకుల మనుగడ కోసమే.. ‘రాజద్రోహం’ కేసులు: ఆర్‌.నారాయణమూర్తి

విజయవాడ: ‘‘స్వాతంత్య్ర పోరాటంలో భారతీయుల గొంతు నొక్కడానికి రాజద్రోహం చట్టాన్ని అమలు చేసిన బ్రిటిష్‌ వాళ్లే తమ దేశంలో ఈ చట్టాన్ని రద్దు చేశారు. స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను సాధించి 75 ఏళ్లు అవుతున్న భారతదేశంలో ఇంకా ఈ చట్టాన్ని అమలు చేయడం దారుణం. హక్కులు, స్వేచ్ఛ కోసం పోరాడితే రాజద్రోహం అవుతుందా?’’ అని సినీనటుడు ఆర్‌.నారాయణమూర్తి ప్రశ్నించారు. రాజద్రోహం కేసులకు సంబంధించి కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చి తీర్పు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాజద్రోహం వేరు, దేశద్రోహం వేరు అన్న సుప్రీంకోర్టు తీరుపై సంతోషం వెలిబుచ్చారు. గురువారం ఆయన మీడియాతో స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా మనదేశంలో రాజద్రోహం చట్టాన్ని అమలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. కేవలం ప్రభుత్వాలు వాటి మనుగడ కోసమే ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయని ఆర్‌.నారాయణమూర్తి విమర్శించారు.

Updated Date - 2022-05-20T02:00:32+05:30 IST