పల్లకిపై నారాయణస్వామి వారు

ABN , First Publish Date - 2021-03-09T07:13:22+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానంలో నారాయణస్వామి 63వ సప్తాహ్నిక మహోత్సవాలు నాలుగవరోజు సోమవారం ఘనంగా నిర్వహించారు.

పల్లకిపై నారాయణస్వామి వారు
విశేష అలంకరణలో స్వామివారు

శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబు

సీఎ్‌సపురం, మార్చి 8 : ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానంలో నారాయణస్వామి 63వ సప్తాహ్నిక మహోత్సవాలు నాలుగవరోజు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వేదపారాయణం, మహా మృత్యుంజయ, ఆయూష్‌ హోమములు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత విష్ణుమూర్తిస్వామి వార్లకు హనుమంతవాహన సేవ, నారాయణస్వామివారికి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి పామూరు మండలం లక్ష్మీనరసాపురం గ్రామానికి చెందిన గాజులపల్లి వెంకటేశ్వరెడ్డి ధనలక్ష్మి దంపతులు వారి కుమారుడు విష్ణువర్థన్‌రెడ్డి, అల్లుడు, కుమార్తె తాళ్ల సాయికృష్ణ, వైష్ణవి దంపతులు ఉభయదాతలుగా ఉన్నారు.

మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థాన ప్రాంగణంలో 10 సంవత్సరాల క్రితం నిర్మించి నిరుపయోగంగా ఉన్న టీటీపీ కల్యాణ మండపానికి మరమ్మతులు చేయించి వాడుకలోనికి తేవాలని దేవస్థానచైర్మన్‌ దుగ్గిరెడ్డి జయరెడ్డి, కార్య నిర్వాహణాధికారి కె.నవీన్‌కుమార్‌ కోరారు. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్‌ వై.వీ.సుబ్బారెడ్డిని తాడేపల్లిలోని ఆయన కార్యాలయంలో సోమవారం కలిసి విజ్ఞప్తి చేసినట్లు వారు తెలిపారు.  

ఉలవపాడు : మండలంలోని శైవక్షేత్రాల్లో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మన్నేటికోట గ్రామంలో వేంచేసిన  శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా ఉలవపాడులోని గంగాపర్వత వర్ధినీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానాలు శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయని దేవస్థానం కార్యదర్శి జానకమ్మ చెప్పారు. శివవరాత్రి రోజున జాగారం ఉండే భక్తులకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  

Updated Date - 2021-03-09T07:13:22+05:30 IST