తిరుపతి: ఆడపిల్లలను వారి ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోనివకుండా కార్పొరేట్ కంపెనీలకు లేబర్‌ని అందించాలనే ఉద్దేశ్యంతోనే కేంద్రం అమ్మాయిల పెళ్లి వయస్సు పెంచిందని సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సీపీఐ 97వ అవతరణ దినోత్సవంలో నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమ్మాయిల వివాహ వయస్సు 21 సంవత్సరాలు పెంచడం కంటే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తేవాలని డిమాండ్ చేశారు. మద్యం ధర తగ్గించి పెట్రోల్ ధర పెంచటం తగదని నారాయణ అన్నారు.
సీఎం జగన్మోహన్‌రెడ్డి శాడిస్ట్ ఆలోచన వల్లే సినిమా టికెట్ ధర తగ్గించి, థియేటర్స్ మూయిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన సూచనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో హద్దు మీరి ప్రవర్తిస్తోందని.. ఆ పార్టీ నేత గుప్తాపై దాడి ఒక ఉదాహరణ మాత్రమేనని చెప్పారు.తల్లిపాలు లాంటి అమరావతి ఉద్యమానికి పోటీగా పోత పాలలాంటి రాయలసీమ, కోస్తా ఉద్యమాలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్‌లో ఈసారి బీజేపీ అధికారంలోకి రాదని నారాయణ జోస్యం చెప్పారు.
ఇవి కూడా చదవండి